< కీర్తనల~ గ్రంథము 17 >

1 దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయం కోసం నేను చేసే అభ్యర్ధన ఆలకించు, నా మొర పట్ల శ్రద్ధ చూపించు, కపటం లేని నా పెదాలనుంచి వచ్చే ప్రార్థన నీకు వినిపించనివ్వు.
Услиши, Господе, правду, чуј глас мој, прими у уши молитву моју не из уста лажљивих.
2 నేను నిర్దోషినన్న రుజువు నీ సన్నిధినుంచి రానియ్యి. న్యాయమైనదేదో దాన్ని నీ కళ్ళు చూడనియ్యి.
Од лица Твог нека изађе суд мој, очи Твоје нека погледају на правицу.
3 రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరీక్షిస్తే, నువ్వు నన్ను శుద్ధి చేస్తావు, నాలో ఏ దుష్ట ప్రణాళికలూ నీకు కనబడవు. నా నోరు అతిక్రమించి మాట్లాడదు.
Испитај срце моје, обиђи ноћу; у огњу ме окушај, и нећеш наћи неправде моје.
4 మనుషుల చేతల విషయమైతే, నీ నోటి మాటనుబట్టి అరాచకుల మార్గాలనుంచి నన్ను నేను దూరంగా ఉంచుకున్నాను.
Уста се моја не дохватају дела људских; ради речи уста Твојих држим се путева оштрих.
5 నీ అడుగుజాడల్లో నా అడుగులు స్థిరంగా ఉన్నాయి. నా కాళ్ళు జారలేదు.
Утврди стопе моје на стазама својим да не залазе кораци моји.
6 నేను నీకు నివేదన చేశాను. ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. దేవా, నేను నీతో మాట్లాడినప్పుడు నా మాట నీ చెవిన పడనివ్వు.
Тебе призивам, јер ћеш ме услишити Боже! Пригни к мени ухо своје, и чуј речи моје.
7 శత్రువుల బారి నుంచి రక్షణ కోసం నీలో ఆశ్రయం పొందిన వాళ్ళను నీ కుడిచేతితో రక్షించేవాడా, నీ నిబంధన నమ్మకత్వాన్ని అద్భుతంగా నాకు కనపరుచు.
Покажи дивну милост своју, који избављаш оне који се у Те уздају од оних који се противе десници Твојој.
8 నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
Чувај ме као зеницу ока: сеном крила својих заклони ме
9 నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.
Од безбожника који ме нападају, од непријатеља душе моје, који су ме опколили.
10 ౧౦ వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి.
Срце своје затворише; устима својим говоре охоло.
11 ౧౧ నా అడుగులను వాళ్ళు చుట్టుముట్టారు. నన్ను దెబ్బతీసి నేలకూల్చడానికి కనిపెడుతున్నారు.
Изагнавши ме опет су око мене; очи су своје упрли да ме оборе на земљу.
12 ౧౨ వాళ్ళు వేటకు ఆతురతతో ఉన్న సింహంలా ఉన్నారు. చాటైన స్థలాల్లో పొంచి ఉన్న సింహం కూనలాగా ఉన్నారు.
Они су као лав који хоће да растрже, и као лавић који седи у потаји.
13 ౧౩ యెహోవా లేచి రా! వాళ్ళ మీద పడు! వాళ్ళ ముఖాలు నేలకు కొట్టు! నీ ఖడ్గంతో దుర్మార్గులనుంచి నా ప్రాణం రక్షించు.
Устани, Господе, претеци их, обори их. Одбрани душу моју мачем својим од безбожника,
14 ౧౪ నీ చేతితో మనుషుల బారినుండి, యెహోవా, ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుంచి నన్ను రక్షించు. నువ్వు అపురూపంగా ఎంచిన నీ వాళ్ళ కడుపులు నిధులతో నింపుతావు. వాళ్ళు బహుసంతానం కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు సంక్రమింపజేస్తారు.
Руком својом, Господе, од људи ових, од људи овог света, којима је део овај живот, којима си трбух напунио свог богатства, да ће им и синови бити сити и остатак оставити својој деци.
15 ౧౫ నేనైతే న్యాయవంతుడిగా నీ ముఖం చూస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ సుదర్శనం చూసి నేను తృప్తి పొందుతాను.
А ја ћу у правди гледати лице Твоје; кад се пробудим, бићу сит од прилике Твоје.

< కీర్తనల~ గ్రంథము 17 >