< కీర్తనల~ గ్రంథము 17 >
1 ౧ దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయం కోసం నేను చేసే అభ్యర్ధన ఆలకించు, నా మొర పట్ల శ్రద్ధ చూపించు, కపటం లేని నా పెదాలనుంచి వచ్చే ప్రార్థన నీకు వినిపించనివ్వు.
【無辜者的懇禱】上主,請靜聽我的伸訴,俯聽我的呼號,請傾聽我出自絕虛偽唇舌的祈禱。
2 ౨ నేను నిర్దోషినన్న రుజువు నీ సన్నిధినుంచి రానియ్యి. న్యాయమైనదేదో దాన్ని నీ కళ్ళు చూడనియ్యి.
願我的案件在你面前判決,願你的眼睛細察何為清白!
3 ౩ రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరీక్షిస్తే, నువ్వు నన్ను శుద్ధి చేస్తావు, నాలో ఏ దుష్ట ప్రణాళికలూ నీకు కనబడవు. నా నోరు అతిక్రమించి మాట్లాడదు.
任你考驗我的心靈,夜間來視察我,以火鍛鍊我,你總找不到我的邪惡。因我的口總未像人一樣犯了罪過。
4 ౪ మనుషుల చేతల విషయమైతే, నీ నోటి మాటనుబట్టి అరాచకుల మార్గాలనుంచి నన్ను నేను దూరంగా ఉంచుకున్నాను.
我依照你的訓令,遵行法律的正道。
5 ౫ నీ అడుగుజాడల్లో నా అడుగులు స్థిరంగా ఉన్నాయి. నా కాళ్ళు జారలేదు.
我的雙腳緊隨了你的腳印,我的腳步決不致蹣跚不定。
6 ౬ నేను నీకు నివేదన చేశాను. ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. దేవా, నేను నీతో మాట్లాడినప్పుడు నా మాట నీ చెవిన పడనివ్వు.
天主,我向你呼號,請你回答我,求你側耳聽我,俯聽我的祈禱。
7 ౭ శత్రువుల బారి నుంచి రక్షణ కోసం నీలో ఆశ్రయం పొందిన వాళ్ళను నీ కుడిచేతితో రక్షించేవాడా, నీ నిబంధన నమ్మకత్వాన్ని అద్భుతంగా నాకు కనపరుచు.
請你彰現你奇妙的慈愛,將投奔到你身右邊的人,從敵人的危害中救出來。
8 ౮ నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
求你護衛我有如眼中的瞳仁,在你雙翼的庇護下叫我藏身,
9 ౯ నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.
使我脫離害我的暴民,及那企圖消滅我的仇人,
10 ౧౦ వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి.
他們關閉了鐵石的心腸,口中語言盡是誇大狂妄,
11 ౧౧ నా అడుగులను వాళ్ళు చుట్టుముట్టారు. నన్ను దెబ్బతీసి నేలకూల్చడానికి కనిపెడుతున్నారు.
他們的腳步現已把我緊逼,瞪著眼務要將我推倒在地。
12 ౧౨ వాళ్ళు వేటకు ఆతురతతో ఉన్న సింహంలా ఉన్నారు. చాటైన స్థలాల్లో పొంచి ఉన్న సింహం కూనలాగా ఉన్నారు.
他們好似急於掠食的猛獅,他們又如伏在暗處的壯獅。
13 ౧౩ యెహోవా లేచి రా! వాళ్ళ మీద పడు! వాళ్ళ ముఖాలు నేలకు కొట్టు! నీ ఖడ్గంతో దుర్మార్గులనుంచి నా ప్రాణం రక్షించు.
上主,起來迎擊制服我的仇讎,上主揮動利劍救我脫離惡徒。
14 ౧౪ నీ చేతితో మనుషుల బారినుండి, యెహోవా, ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుంచి నన్ను రక్షించు. నువ్వు అపురూపంగా ఎంచిన నీ వాళ్ళ కడుపులు నిధులతో నింపుతావు. వాళ్ళు బహుసంతానం కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు సంక్రమింపజేస్తారు.
上主,求你親手將他們治死,殺死他們,使他們離開此世,滅絕他們,使他們不再呼吸。求你使義人享用你的財富,使他們的子女也心滿意足,再把剩餘的給自己的子女。
15 ౧౫ నేనైతే న్యాయవంతుడిగా నీ ముఖం చూస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ సుదర్శనం చూసి నేను తృప్తి పొందుతాను.
我因我的正義能享見你的聖顏,我醒來得能盡情欣賞你的慈面