< కీర్తనల~ గ్రంథము 16 >
1 ౧ దావీదు మిఖ్తీమ్ (ప్రశస్థ) కీర్తన. దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు.
Dawid mpaeɛbɔ. Bɔ me ho ban, Ao Onyankopɔn, na wo mu na menya hintabea.
2 ౨ నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.
Meka kyerɛɛ Awurade sɛ, “MʼAwurade ne wo; menni adepa biara ka wo ho.”
3 ౩ భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే.
Ahotefoɔ a wɔwɔ asase no so deɛ, wɔne animuonyamfoɔ a mʼanigyeɛ wɔ wɔn mu.
4 ౪ యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను.
Wɔn a wɔdi anyame afoforɔ akyire no wɔn awerɛhoɔ bɛdɔɔso. Merenyi wɔn mogya apaeɛ no bi na meremfa mʼano memmɔ wɔn din.
5 ౫ యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది.
Awurade, wode me kyɛfa ne me kuruwa ama me; woama me kyɛfa anya banbɔ.
6 ౬ మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది.
Mʼahyeɛ akɔdeda mmea a ɛhɔ yɛ ahomeka; ampa ara mewɔ agyapadeɛ a ɛho yɛ anigye.
7 ౭ నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.
Mɛkamfo Awurade a ɔtu me fo; na anadwo mpo mʼakoma kyerɛkyerɛ me.
8 ౮ అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!
Mehunu Awurade wɔ mʼani so daa nyinaa. Esiane sɛ ɔwɔ me nsa nifa enti, merenhinhim da.
9 ౯ అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను.
Ɛno enti, me kra ani gye, na mede me tɛkrɛma di ahurisie; me onipadua nso bɛhome asomdwoeɛ mu,
10 ౧౦ ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. (Sheol )
ɛfiri sɛ, worennya me awufoɔ mu. Na woremma wo Kronkronni no mporɔ. (Sheol )
11 ౧౧ జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
Woakyerɛ me nkwagyeɛ kwan, na wobɛma mʼani agye wɔ wʼanim, na anika a ɛrensa da wɔ wo nifa so.