< కీర్తనల~ గ్రంథము 16 >

1 దావీదు మిఖ్తీమ్ (ప్రశస్థ) కీర్తన. దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు.
(En miktam af David.) Vogt mig, Gud, thi jeg lider på dig!
2 నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.
Jeg siger til HERREN: "Du er min Herre; jeg har ikke andet Gode end dig.
3 భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే.
De hellige, som er i Landet, de er de herlige, hvem al min Hu står til."
4 యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను.
Mange Kvaler rammer dem, som vælger en anden Gud; deres Blodofre vil jeg ikke udgyde, ej tage deres Navn i min Mund.
5 యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది.
HERREN er min tilmålte Del og mit Bæger. Du holder min Arvelod i Hævd.
6 మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది.
Snorene faldt mig på liflige Steder, ja, en dejlig Arvelod tilfaldt mig.
7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.
Jeg vil prise HERREN, der gav mig Råd, mine Nyrer maner mig, selv om Natten.
8 అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!
Jeg har altid HERREN for Øje, han er ved min højre, jeg rokkes ikke.
9 అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను.
Derfor glædes mit Hjerte, min Ære jubler, endogså mit Kød skal bo i Tryghed.
10 ౧౦ ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. (Sheol h7585)
Thi Dødsriget giver du ikke min Sjæl, lader ikke din hellige skue Graven. (Sheol h7585)
11 ౧౧ జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
Du lærer mig Livets Vej; man mættes af Glæde for dit Åsyn, Livsalighed er i din højre for evigt.

< కీర్తనల~ గ్రంథము 16 >