< కీర్తనల~ గ్రంథము 148 >
1 ౧ యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.
Hvalite Gospoda na nebesima, hvalite ga na visini.
2 ౨ ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.
Hvalite ga, svi anðeli njegovi, hvalite ga, sve vojske njegove!
3 ౩ సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.
Hvalite ga, sunce i mjeseèe, hvalite ga, sve zvijezde sjajne!
4 ౪ అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.
Hvalite ga, nebesa nad nebesima i vodo nad nebesima!
5 ౫ అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.
Neka hvale ime Gospodnje, jer on zapovjedi i stvoriše se.
6 ౬ ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.
Postavi ih zasvagda i zavavijek, dade naredbu, koja neæe proæi.
7 ౭ భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.
Hvalite Gospoda na zemlji, velike ribe i sve bezdane;
8 ౮ అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.
Oganj i grad, snijeg i magla, vjetar silni, koji izvršuje rijeè njegovu,
9 ౯ పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి.
Gore i svi humovi, rodna drveta i svi kedri,
10 ౧౦ మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.
Zvijeri i sva stoka, bubine i ptice krilate,
11 ౧౧ భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి.
Carevi zemaljski i svi narodi, knezovi i sve sudije zemaljske,
12 ౧౨ యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక.
Momci i djevojke, starci i djeca,
13 ౧౩ ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.
Neka hvale ime Gospodnje; jer je samo njegovo ime uzvišeno, slava njegova na zemlji i na nebu.
14 ౧౪ ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.
On je uzvisio rog naroda svojega, slavu svijeh svetaca svojih, sinova Izrailjevih, naroda, koji je blizu njega.