< కీర్తనల~ గ్రంథము 147 >
1 ౧ యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది.
Halleluja! Ja, det er godt at lovsynge vor Gud, ja, det er lifligt, Lovsang sømmer sig.
2 ౨ యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే.
HERREN bygger Jerusalem, han samler de spredte af Israel,
3 ౩ గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
han læger dem, hvis Hjerte er sønderknust, og forbinder deres Saar;
4 ౪ ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
han fastsætter Stjernernes Tal og giver dem alle Navn.
5 ౫ మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.
Vor Herre er stor og vældig, hans Indsigt er uden Maal;
6 ౬ యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.
HERREN holder de ydmyge oppe, til Jorden bøjer han gudløse.
7 ౭ కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.
Syng for HERREN med Tak, leg for vor Gud paa Citer!
8 ౮ ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
Han dækker Himlen med Skyer, sørger for Regn til Jorden, lader Græs spire frem paa Bjergene og Urter til Menneskers Brug;
9 ౯ పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
Føde giver han Kvæget og Ravneunger, som skriger;
10 ౧౦ గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు.
hans Hu staar ikke til stærke Heste, han har ikke Behag i rapfodet Mand;
11 ౧౧ తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.
HERREN har Behag i dem, der frygter ham, dem, der bier paa hans Miskundhed.
12 ౧౨ యెరూషలేమా, యెహోవాను ఘనపరచు. సీయోనూ, నీ దేవుణ్ణి కీర్తించు.
Lovpris HERREN, Jerusalem, pris, o Zion, din Gud!
13 ౧౩ ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు.
Thi han gør dine Portstænger stærke, velsigner dine Børn i din Midte;
14 ౧౪ నీ పొలిమేరల్లో శాంతి సమాధానాలు నిలిచి ఉండేలా చేసేది ఆయనే. నీకు ఆహారంగా మంచి గోదుమ పంటను ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే.
dine Landemærker giver han Fred, mætter dig med Hvedens Fedme;
15 ౧౫ భూమికి ఆజ్ఞ జారీ చేసేవాడు ఆయనే. ఆయన వాక్కు భూమిపై చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
han sender sit Bud til Jorden, hastigt løber hans Ord,
16 ౧౬ గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.
han lader Sne falde ned som Uld, som Aske spreder han Rim,
17 ౧౭ వడగళ్ళు ముక్కలు ముక్కలుగా నేలపై విసిరేది ఆయనే. ఆయన చలి పుట్టించినప్పుడు ఎవరు తట్టుకోగలరు?
som Brødsmuler sender han Hagl, Vandene stivner af Kulde fra ham;
18 ౧౮ ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి వీచేలా చేస్తే నీళ్లు ప్రవహిస్తాయి.
han sender sit Ord og smelter dem, de strømmer, naar han rejser sit Vejr.
19 ౧౯ తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు.
Han kundgør sit Ord for Jakob, sine Vedtægter og Lovbud for Israel.
20 ౨౦ మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.
Saa gjorde han ikke mod andre Folk, dem kundgør han ingen Lovbud. Halleluja!