< కీర్తనల~ గ్రంథము 146 >
1 ౧ యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు.
我的靈魂,您要讚美上主,
2 ౨ నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.
在我一生,我要讚美上主,一息尚存,我要歌頌天主。
3 ౩ రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు.
您們不要全心依賴王侯大臣,也不要依賴不能施救的世人;
4 ౪ వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.
他的氣息一斷,就歸於灰土,他的一切計劃立刻化為烏有。
5 ౫ యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.
凡是以雅各伯的天主為自己扶助的人,上主天主為自己希望的,是有福的人。
6 ౬ ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.
上主創造了上天與下土,海洋和其中的所有一切。他持守信實,一直到永久。
7 ౭ దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.
上主為被欺的人作辯護,上主給饑餓的人賜食物,上主使被囚的人得自由。
8 ౮ యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.
上主開啟瞎子的眼睛,上主使傴僂的人直身,上主愛慕那正義的人。
9 ౯ ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.
上主對旅客加以保護,上主支持孤兒和寡婦,上主迷惑惡人的道路。
10 ౧౦ యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.
願上主永永遠遠為君王!熙雍,您的天主萬壽無疆!