< కీర్తనల~ గ్రంథము 145 >
1 ౧ దావీదు రాసిన స్తుతి కీర్తన నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.
Ayeyi dwom. Dawid de. Mɛma wo so, me Nyankopɔn, Ɔhenkɛse; mɛkamfo wo din daa daa.
2 ౨ అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.
Da biara, mɛkamfo wo; na mama wo din so daa daa.
3 ౩ యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.
Awurade so, na ɔsɛ nkamfo kɛse; obiara ntumi nsusuw ne kɛseyɛ.
4 ౪ ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.
Awo ntoatoaso baako bɛkamfo wo nnwuma akyerɛ afoforo; wɔbɛka wo nnwuma akɛse ho asɛm.
5 ౫ వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.
Wɔbɛka wʼanuonyam ne wo tumi a ɛheran no ho asɛm, na mɛdwene wʼanwonwadwuma ho.
6 ౬ వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను.
Wɔbɛka wo nnwuma a ɛyɛ hu no mu tumi ho asɛm; na mapae mu aka wo nneyɛe akɛse no akyerɛ.
7 ౭ నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు.
Wɔbɛhyɛ wo papayɛ mmoroso no ho fa, na wɔde anigye ato wo trenee ho dwom.
8 ౮ యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.
Awurade yɛ ɔdomfo ne mmɔborɔhunufo; ne bo kyɛ fuw na nʼadɔe dɔɔso.
9 ౯ యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.
Awurade ye ma obiara; na ɔwɔ ahummɔbɔ ma nʼabɔde nyinaa.
10 ౧౦ యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
Awurade, wʼabɔde nyinaa bɛkamfo wo; na wʼahotefo bɛma wo so.
11 ౧౧ నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు.
Wɔbɛka wʼahenni no anuonyam ho asɛm na wɔaka wo mmaninyɛ ho asɛm,
12 ౧౨ మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
sɛ ɛbɛyɛ a nnipa behu wo nnwuma akɛse ne wʼahenni anuonyam a ɛheran no.
13 ౧౩ నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
Wʼahenni yɛ daa ahenni, na wo tumidi wɔ hɔ ma awo ntoantoaso nyinaa. Awurade di ne bɔhyɛ nyinaa so, na ɔwɔ ɔdɔ ma biribiara a wayɛ.
14 ౧౪ కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.
Awurade wowaw wɔn a wɔhwe ase na ɔpagyaw wɔn a wɔn nnesoa ama wɔakom.
15 ౧౫ జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
Aniwa nyinaa hwɛ wo kwan, na woma wɔn, wɔn aduan wɔ ne bere mu.
16 ౧౬ నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
Wubue wo nsam, na woma biribiara a ɛwɔ nkwa no nʼapɛde.
17 ౧౭ యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
Awurade teɛ wɔ nʼakwan nyinaa mu; na ɔyɛ adɔe ma nea wayɛ nyinaa.
18 ౧౮ ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
Awurade bɛn wɔn a wɔfrɛ no nyinaa, wɔn a wɔfrɛ no nokware mu nyinaa.
19 ౧౯ తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు.
Ɔyɛ wɔn a wosuro no no apɛde ma wɔn; otie wɔn sufrɛ na ogye wɔn.
20 ౨౦ తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.
Awurade hwɛ wɔn a wɔdɔ no no nyinaa so, nanso amumɔyɛfo de, ɔbɛsɛe wɔn nyinaa.
21 ౨౧ నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక.
Mʼano bɛkamfo Awurade. Ma abɔde nyinaa nkamfo ne din kronkron no daa daa.