< కీర్తనల~ గ్రంథము 143 >
1 ౧ దావీదు కీర్తన యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
Господе, услиши молитву моју, прими мољење моје по истини својој, услиши ме по правди својој.
2 ౨ నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు.
И не иди на суд са слугом својим, јер се неће оправдати пред Тобом нико жив.
3 ౩ నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు. నన్ను నేలకేసి తొక్కిపెట్టాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళతో బాటు నన్ను కూడా పాతాళంలో ఉండిపోయేలా చేయాలని చూస్తున్నాడు.
Непријатељ гони душу моју, гази у прах живот мој, посађује ме у мрак, као давно помрле.
4 ౪ నా హృదయం నాలో నిరాశకులోనైంది. నా ఆత్మ నాలో క్షీణించిపోయింది.
Трне у мени дух мој, нестаје у мени срца мог.
5 ౫ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
Помињем дане старе, пребрајам све послове Твоје, размишљам о делима руку Твојих.
6 ౬ నీ వైపు నా చేతులు ఆశగా చాపుతున్నాను. ఎండి నెర్రెలు విచ్చిన నేలలాగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతూ ఉంది. (సెలా)
Пружам к Теби руке своје; душа је моја као сува земља пред Тобом.
7 ౭ యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
Похитај, услиши ме; Господе, нестаје духа мог, немој одвратити лице своје од мене; јер ћу бити као они који одлазе у гроб.
8 ౮ నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
Рано ми јави милост своју, јер се у Тебе уздам. Покажи ми пут, којим да идем, јер к Теби подижем душу своју.
9 ౯ యెహోవా, నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించు. నీ అండనే కోరుతున్నాను.
Избави ме од непријатеља мојих, Господе, к Теби притечем.
10 ౧౦ నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
Научи ме Творити вољу Твоју, јер си Ти Бог мој; дух Твој благи нека ме води по стази правој.
11 ౧౧ యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.
Имена ради свог, Господе, оживи ме, по правди својој изведи из муке душу моју.
12 ౧౨ నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి.
И по милости својој истреби непријатеље моје, и погуби све који муче душу моју, јер сам Твој слуга.