< కీర్తనల~ గ్రంథము 142 >
1 ౧ దావీదు దైవధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.
다윗이 굴에 있을 때에 지은 마스길 내가 소리내어 여호와께 부르짖으며 소리내어 여호와께 간구하는도다
2 ౨ ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను.
내가 내 원통함을 그 앞에 토하며 내 우환을 그 앞에 진술하는도다
3 ౩ నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు.
내 심령이 속에서 상할 때에도 주께서 내 길을 아셨나이다 나의 행하는 길에 저희가 나를 잡으려고 올무를 숨겼나이다
4 ౪ నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.
내 우편을 살펴 보소서 나를 아는 자도 없고 피난처도 없고 내 영혼을 돌아보는 자도 없나이다
5 ౫ యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను.
여호와여 내가 주께 부르짖어 말하기를 주는 나의 피난처시요 생존 세계에서 나의 분깃이시라 하였나이다
6 ౬ నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
나의 부르짖음을 들으소서 나는 심히 비천하니이다 나를 핍박하는 자에게서 건지소서 저희는 나보다 강하니이다
7 ౭ నేను నీ నామాన్ని కీర్తించేలా చెరలోనుండి నా ప్రాణాన్ని తప్పించు. అప్పుడు నీవు నాకు చేసిన మహోపకారాన్ని బట్టి నీతిమంతులు నా చుట్టూ చేరి ఆనందిస్తారు.
내 영혼을 옥에서 이끌어 내사 주의 이름을 감사케 하소서 주께서 나를 후대하시리니 의인이 나를 두르리이다