< కీర్తనల~ గ్రంథము 142 >

1 దావీదు దైవధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.
A contemplation by David, when he was in the cave. A Prayer. I cry with my voice to the LORD. With my voice, I ask the LORD for mercy.
2 ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను.
I pour out my complaint before him. I tell him my troubles.
3 నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు.
When my spirit was overwhelmed within me, you knew my route. On the path in which I walk, they have hidden a snare for me.
4 నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.
Look on my right, and see; for there is no one who is concerned for me. Refuge has fled from me. No one cares for my soul.
5 యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను.
I cried to you, LORD. I said, “You are my refuge, my portion in the land of the living.”
6 నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
Listen to my cry, for I am in desperate need. Deliver me from my persecutors, for they are too strong for me.
7 నేను నీ నామాన్ని కీర్తించేలా చెరలోనుండి నా ప్రాణాన్ని తప్పించు. అప్పుడు నీవు నాకు చేసిన మహోపకారాన్ని బట్టి నీతిమంతులు నా చుట్టూ చేరి ఆనందిస్తారు.
Bring my soul out of prison, that I may give thanks to your name. The righteous will surround me, for you will be good to me.

< కీర్తనల~ గ్రంథము 142 >