< కీర్తనల~ గ్రంథము 139 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.
למנצח לדוד מזמור יהוה חקרתני ותדע׃
2 నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.
אתה ידעת שבתי וקומי בנתה לרעי מרחוק׃
3 నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.
ארחי ורבעי זרית וכל דרכי הסכנתה׃
4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.
כי אין מלה בלשוני הן יהוה ידעת כלה׃
5 నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.
אחור וקדם צרתני ותשת עלי כפכה׃
6 ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు.
פלאיה דעת ממני נשגבה לא אוכל לה׃
7 నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను?
אנה אלך מרוחך ואנה מפניך אברח׃
8 ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. (Sheol h7585)
אם אסק שמים שם אתה ואציעה שאול הנך׃ (Sheol h7585)
9 నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను.
אשא כנפי שחר אשכנה באחרית ים׃
10 ౧౦ అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.
גם שם ידך תנחני ותאחזני ימינך׃
11 ౧౧ నేనిలా అనుకుంటాను, చీకటి నన్ను దాచిపెడుతుంది. నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిలాగా అవుతుంది.
ואמר אך חשך ישופני ולילה אור בעדני׃
12 ౧౨ అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి.
גם חשך לא יחשיך ממך ולילה כיום יאיר כחשיכה כאורה׃
13 ౧౩ దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.
כי אתה קנית כליתי תסכני בבטן אמי׃
14 ౧౪ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.
אודך על כי נוראות נפליתי נפלאים מעשיך ונפשי ידעת מאד׃
15 ౧౫ నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.
לא נכחד עצמי ממך אשר עשיתי בסתר רקמתי בתחתיות ארץ׃
16 ౧౬ నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.
גלמי ראו עיניך ועל ספרך כלם יכתבו ימים יצרו ולא אחד בהם׃
17 ౧౭ దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది.
ולי מה יקרו רעיך אל מה עצמו ראשיהם׃
18 ౧౮ వాటిని లెక్కపెడదామనుకుంటే అవి ఇసక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను.
אספרם מחול ירבון הקיצתי ועודי עמך׃
19 ౧౯ దేవా, దుష్టులను నువ్వు కచ్చితంగా హతమారుస్తావు. హింసించే వాళ్ళంతా నా దగ్గర నుండి వెళ్ళిపొండి.
אם תקטל אלוה רשע ואנשי דמים סורו מני׃
20 ౨౦ వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు.
אשר יאמרך למזמה נשא לשוא עריך׃
21 ౨౧ యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా.
הלוא משנאיך יהוה אשנא ובתקוממיך אתקוטט׃
22 ౨౨ వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు.
תכלית שנאה שנאתים לאויבים היו לי׃
23 ౨౩ దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.
חקרני אל ודע לבבי בחנני ודע שרעפי׃
24 ౨౪ నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.
וראה אם דרך עצב בי ונחני בדרך עולם׃

< కీర్తనల~ గ్రంథము 139 >