< కీర్తనల~ గ్రంథము 138 >
1 ౧ దావీదు కీర్తన నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.
Dávidtól. Magasztallak egész szívemmel, szemben az istenekkel, zengek neked.
2 ౨ నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.
Leborulok szent templomod felé és magasztalom nevedet szeretetedért és hüségedért, mert, nagygyá tetted minden neved fölött a szavadat.
3 ౩ నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.
A mely napon hivtalak, meghallgattál; büszkévé teszel, lelkemben erő van.
4 ౪ యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.
Magasztaljanak téged, Örökkévaló, mind a föld királyai, mert hallották szájad szavait,
5 ౫ యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.
és énekeljék meg az Örökkévaló útjait, mert nagy az Örökkévaló dicsősége.
6 ౬ యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.
Mert magas az Örökkévaló, de látja az alacsonyt s a fenhéjázót messziről ismeri.
7 ౭ నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది.
Ha járok szorongatás közepette, életben tartasz; ellenségeim haragja ellen kinyújtod kezedet, s megsegít engem a te jobbod.
8 ౮ యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.
Az Örökkévaló végez érettem; Örökkévaló, kegyelmed örökké tart, kezeid műveit ne hagyd cserben!