< కీర్తనల~ గ్రంథము 137 >

1 మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.
By the rivers of Babylon, there we sat down, yea, we wept, when we remembered Zion.
2 అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం.
We hanged our harps upon the willows in the midst thereof.
3 మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు.
For there they that carried us away captive required of us a song; and they that wasted us required of us delight, saying, Sing us one of the songs of Zion.
4 మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?
How shall we sing the LORD's song in a strange land?
5 యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక.
If I forget you, O Jerusalem, let my right hand forget her cunning.
6 నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక.
If I do not remember you, let my tongue cleave to the roof of my mouth; if I prefer not Jerusalem above my chief joy.
7 యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా.
Remember, O LORD, the children of Edom in the day of Jerusalem; who said, Demolish it, demolish it, even to the foundation thereof.
8 నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.
O daughter of Babylon, who are to be destroyed; happy shall he be, that rewards you as you have served us.
9 నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.
Happy shall he be, that takes and dashes your little ones against the stones.

< కీర్తనల~ గ్రంథము 137 >