< కీర్తనల~ గ్రంథము 136 >

1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
הודו ליהוה כי טוב כי לעולם חסדו׃
2 ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
הודו לאלהי האלהים כי לעולם חסדו׃
3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
הודו לאדני האדנים כי לעולם חסדו׃
4 గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לעשה נפלאות גדלות לבדו כי לעולם חסדו׃
5 ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לעשה השמים בתבונה כי לעולם חסדו׃
6 ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לרקע הארץ על המים כי לעולם חסדו׃
7 ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לעשה אורים גדלים כי לעולם חסדו׃
8 పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
את השמש לממשלת ביום כי לעולם חסדו׃
9 రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
את הירח וכוכבים לממשלות בלילה כי לעולם חסדו׃
10 ౧౦ ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
למכה מצרים בבכוריהם כי לעולם חסדו׃
11 ౧౧ ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ויוצא ישראל מתוכם כי לעולם חסדו׃
12 ౧౨ ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ביד חזקה ובזרוע נטויה כי לעולם חסדו׃
13 ౧౩ ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לגזר ים סוף לגזרים כי לעולם חסדו׃
14 ౧౪ ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
והעביר ישראל בתוכו כי לעולם חסדו׃
15 ౧౫ ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ונער פרעה וחילו בים סוף כי לעולם חסדו׃
16 ౧౬ ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
למוליך עמו במדבר כי לעולם חסדו׃
17 ౧౭ గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
למכה מלכים גדלים כי לעולם חסדו׃
18 ౧౮ ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ויהרג מלכים אדירים כי לעולם חסדו׃
19 ౧౯ అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
לסיחון מלך האמרי כי לעולם חסדו׃
20 ౨౦ బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ולעוג מלך הבשן כי לעולם חסדו׃
21 ౨౧ వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ונתן ארצם לנחלה כי לעולם חסדו׃
22 ౨౨ తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
נחלה לישראל עבדו כי לעולם חסדו׃
23 ౨౩ మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
שבשפלנו זכר לנו כי לעולם חסדו׃
24 ౨౪ మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
ויפרקנו מצרינו כי לעולם חסדו׃
25 ౨౫ సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
נתן לחם לכל בשר כי לעולם חסדו׃
26 ౨౬ పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
הודו לאל השמים כי לעולם חסדו׃

< కీర్తనల~ గ్రంథము 136 >