< కీర్తనల~ గ్రంథము 135 >

1 యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.
Хвалите имя Господне, хвалите, раби Господа,
2 యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.
стоящии во храме Господни, во дворех дому Бога нашего.
3 యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!
Хвалите Господа, яко благ Господь: пойте имени Его, яко добро:
4 యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.
яко Иакова избра Себе Господь, Израиля в достояние Себе:
5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు.
яко аз познах, яко велий Господь, и Господь наш над всеми боги:
6 భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.
вся, елика восхоте Господь, сотвори на небеси и на земли, в морях и во всех безднах.
7 భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.
Возводя облаки от последних земли, молнии в дождь сотвори, изводяй ветры от сокровищ Своих.
8 ఈజిప్టు ప్రజల తొలిచూలు సంతానాన్ని, పశువుల తొలి సంతతిని ఆయన హతం చేశాడు.
Иже порази первенцы Египетския от человека до скота:
9 ఐగుప్తూ, నీ మధ్య ఆయన సూచకక్రియలు, అద్భుతాలు కనపరచాడు. ఫరోకు, అతని పరివారానికీ వ్యతిరేకంగా వాటిని చేశాడు.
посла знамения и чудеса посреде тебе, Египте, на фараона и на вся рабы его.
10 ౧౦ ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.
Иже порази языки многи и изби цари крепки:
11 ౧౧ అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.
Сиона царя Аморрейска и Ога царя Васанска, и вся царствия Ханаанска:
12 ౧౨ ఆయన వాళ్ళ దేశాలను స్వాస్థ్యంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
и даде землю их достояние, достояние Израилю людем Своим.
13 ౧౩ యెహోవా, నీ నామం శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గూర్చిన జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
Господи, имя Твое в век, и память Твоя в род и род:
14 ౧౪ యెహోవా తన ప్రజల పక్షంగా నిలబడతాడు. అయితే తన సేవకుల విషయం కనికరం చూపిస్తాడు.
яко судити имать Господь людем Своим, и о рабех Своих умолится.
15 ౧౫ ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.
Идоли язык сребро и злато, дела рук человеческих:
16 ౧౬ వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు.
уста имут, и не возглаголют: очи имут, и не узрят:
17 ౧౭ వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.
уши имут, и не услышат: ниже бо есть дух во устех их.
18 ౧౮ వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.
Подобни им да будут творящии я и вси надеющиися на ня.
19 ౧౯ ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.
Доме Израилев, благословите Господа: доме Ааронь, благословите Господа: доме Левиин, благословите Господа:
20 ౨౦ లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.
боящиися Господа, благословите Господа.
21 ౨౧ యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.
Благословен Господь от Сиона, живый во Иерусалиме.

< కీర్తనల~ గ్రంథము 135 >