< కీర్తనల~ గ్రంథము 135 >
1 ౧ యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.
Hallelúja!
2 ౨ యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.
Lýður Drottins lofi hann í forgörðum musteris hans.
3 ౩ యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!
Lofið Drottin því að hann er góður, vegsamið hans dýrlega nafn.
4 ౪ యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.
Því að Drottinn hefur kosið Ísrael sér að eignarlýð.
5 ౫ యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు.
Ég þekki mikilleik Drottins – að hann er öllum guðum æðri.
6 ౬ భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.
Það sem honum þóknast, það gerir hann á himni, á jörðu og einnig í hafdjúpunum!
7 ౭ భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.
Hann lætur skýin stíga upp af jörðinni og eldinguna leiftra svo að rigni; og vindana lætur hann blása úr forðabúrum sínum.
8 ౮ ఈజిప్టు ప్రజల తొలిచూలు సంతానాన్ని, పశువుల తొలి సంతతిని ఆయన హతం చేశాడు.
Hann laust frumburði Egyptalands, bæði menn og dýr.
9 ౯ ఐగుప్తూ, నీ మధ్య ఆయన సూచకక్రియలు, అద్భుతాలు కనపరచాడు. ఫరోకు, అతని పరివారానికీ వ్యతిరేకంగా వాటిని చేశాడు.
Undur og tákn gerði hann í augsýn Faraó og þjóna hans.
10 ౧౦ ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.
Fjölmennar þjóðir lagði hann að velli, felldi volduga konunga
11 ౧౧ అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.
– Síhon, Amoríta-konung og Óg, konung í Basan og konunga Kanaanslands
12 ౧౨ ఆయన వాళ్ళ దేశాలను స్వాస్థ్యంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
og gaf Ísrael lönd þeirra til eilífrar eignar.
13 ౧౩ యెహోవా, నీ నామం శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గూర్చిన జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
Ó, Drottinn, nafn þitt varir að eilífu! Frægð Drottins er kunn frá kynslóð til kynslóðar,
14 ౧౪ యెహోవా తన ప్రజల పక్షంగా నిలబడతాడు. అయితే తన సేవకుల విషయం కనికరం చూపిస్తాడు.
því að hann réttir hlut þjóðar sinnar og miskunnar þjónum sínum.
15 ౧౫ ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.
Heiðingjarnir tilbiðja skurðgoð úr gulli og silfri, handaverk manna
16 ౧౬ వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు.
– mállaus og sjónlaus skurðgoð,
17 ౧౭ వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.
sem hvorki heyra né draga andann.
18 ౧౮ వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.
Smiðir þeirra líkjast þeim og þeir sem tilbiðja þau.
19 ౧౯ ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.
Ísrael, lofa þú Drottin! Æðstuprestar Arons, vegsamið nafn hans,
20 ౨౦ లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.
og einnig þið prestar af Levíætt. Já, lofið nafn hans, öll þið sem treystið honum og óttist hann.
21 ౨౧ యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.
Þið íbúar Jerúsalem, lofið Drottin, hann sem býr í Jerúsalem! Hallelúja!