< కీర్తనల~ గ్రంథము 132 >
1 ౧ యాత్రల కీర్తన యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో.
Una canción de ascensos. Yahvé, recuerda a David y toda su aflicción,
2 ౨ అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.
cómo juró a Yahvé, y se lo juró al Poderoso de Jacob:
3 ౩ నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా,
“Seguramente no entraré en la estructura de mi casa, ni subir a mi cama;
4 ౪ యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను.
No daré sueño a mis ojos, o sueño a mis párpados,
5 ౫ నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.
hasta que encuentre un lugar para Yahvé, una morada para el Poderoso de Jacob”.
6 ౬ ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.
He aquí que lo hemos oído en Efrata. Lo encontramos en el campo de Jaar.
7 ౭ యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.
“Entraremos en su morada. Nos postraremos ante su escabel”.
8 ౮ యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.
Levántate, Yahvé, a tu lugar de descanso, y el arca de tu fuerza.
9 ౯ నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.
Que tus sacerdotes se revistan de justicia. ¡Que tus santos griten de alegría!
10 ౧౦ నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.
Por tu siervo David, no apartes el rostro de tu ungido.
11 ౧౧ నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
Yahvé ha jurado a David en verdad. No se apartará de él: “Pondré el fruto de tu cuerpo en tu trono.
12 ౧౨ నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
Si tus hijos cumplen mi pacto, mi testimonio que les enseñaré, sus hijos también se sentarán en tu trono para siempre”.
13 ౧౩ తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
Porque Yahvé ha elegido a Sión. Él la ha deseado para su habitación.
14 ౧౪ ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.
“Este es mi lugar de descanso para siempre. Viviré aquí, pues lo he deseado.
15 ౧౫ దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.
Bendeciré abundantemente su provisión. Satisfaré a sus pobres con pan.
16 ౧౬ దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.
También vestiré a sus sacerdotes con la salvación. Sus santos gritarán de alegría.
17 ౧౭ అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
Haré brotar allí el cuerno de David. He ordenado una lámpara para mi ungido.
18 ౧౮ అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.
vestiré de vergüenza a sus enemigos, pero en él mismo, su corona brillará”.