< కీర్తనల~ గ్రంథము 130 >

1 యాత్రల కీర్తన యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.
Nyanyian ziarah. Dari jurang kesusahan aku berseru kepada-Mu, ya TUHAN.
2 ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు.
TUHAN, dengarlah seruanku, perhatikanlah permohonanku.
3 యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.
Jika Engkau terus mengingat dosa kami, ya TUHAN, siapakah dapat tahan?
4 అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.
Tetapi Engkau suka mengampuni, supaya orang menjadi takwa.
5 యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.
Aku menantikan bantuan TUHAN, janji-Nya kuharapkan.
6 రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.
Aku merindukan TUHAN, lebih dari seorang peronda merindukan fajar.
7 యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు.
Berharaplah kepada TUHAN, hai umat-Nya, sebab Ia tetap mengasihi, dan selalu siap menyelamatkan.
8 ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.
Ia akan membebaskan kita dari segala kesalahan kita.

< కీర్తనల~ గ్రంథము 130 >