< కీర్తనల~ గ్రంథము 13 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు?
Até quando te esquecerás de mim, Senhor? para sempre? até quando esconderás de mim o teu rosto?
2 ౨ ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?
Até quando consultarei com a minha alma, tendo tristeza no meu coração cada dia? Até quando se exaltará sobre mim o meu inimigo?
3 ౩ యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.
Atende-me, ouve-me, ó Senhor meu Deus; alumia os meus olhos para que eu não adormeça na morte;
4 ౪ నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు.
Para que o meu inimigo não diga: Prevaleci contra ele; e os meus adversários se não alegrem, vindo eu a vacilar.
5 ౫ నేనైతే నీ నిబంధన నమ్మకత్వాన్ని ఆధారం చేసుకున్నాను. నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తూ ఉంది.
Mas eu confio na tua benignidade: na tua salvação se alegrará o meu coração.
6 ౬ యెహోవా నన్ను మేళ్ళతో నింపాడు గనక నేను ఆయనకు కీర్తన పాడతాను.
Cantarei ao Senhor, porquanto me tem feito muito bem.