< కీర్తనల~ గ్రంథము 129 >

1 యాత్రల కీర్తన ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు.
שיר המעלות רבת צררוני מנעורי-- יאמר-נא ישראל
2 నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.
רבת צררוני מנעורי גם לא-יכלו לי
3 భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు.
על-גבי חרשו חרשים האריכו למענותם (למעניתם)
4 యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు.
יהוה צדיק קצץ עבות רשעים
5 సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.
יבשו ויסגו אחור-- כל שנאי ציון
6 వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి.
יהיו כחציר גגות-- שקדמת שלף יבש
7 కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.
שלא מלא כפו קוצר וחצנו מעמר
8 ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.
ולא אמרו העברים-- ברכת-יהוה אליכם ברכנו אתכם בשם יהוה

< కీర్తనల~ గ్రంథము 129 >