< కీర్తనల~ గ్రంథము 129 >
1 ౧ యాత్రల కీర్తన ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు.
從我少年,世人就與我為難,惟願以色列子民再說一遍:
2 ౨ నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.
從我少年,世人就與我為難,然而他們卻未能將我推翻。
3 ౩ భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు.
又像農夫在我背上耕田,使所犁的溝畦又長又遠;
4 ౪ యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు.
但上主卻公道不偏,將惡人的繩索割斷。
5 ౫ సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.
願一切仇恨熙雍的人民,個個蒙受羞辱,轉身逃遁!
6 ౬ వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి.
願他們像屋頂上的禾草,尚未吐出秀穗,就已枯槁!
7 ౭ కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.
收割的人,手拿一把不滿,捆禾的人,懷抱一束不顯。
8 ౮ ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.
過路的人們不會再說:願上主的祝福臨於您們,我們奉上主名祝福您們。