< కీర్తనల~ గ్రంథము 128 >

1 యాత్రల కీర్తన. యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు.
שיר המעלות אשרי כל ירא יהוה ההלך בדרכיו׃
2 నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు.
יגיע כפיך כי תאכל אשריך וטוב לך׃
3 నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు.
אשתך כגפן פריה בירכתי ביתך בניך כשתלי זיתים סביב לשלחנך׃
4 యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు.
הנה כי כן יברך גבר ירא יהוה׃
5 సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక. నువ్వు జీవిత కాలమంతా యెరూషలేము సుసంపన్నం కావడం చూస్తావు.
יברכך יהוה מציון וראה בטוב ירושלם כל ימי חייך׃
6 నీ మనవలు, మనవరాళ్ళను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.
וראה בנים לבניך שלום על ישראל׃

< కీర్తనల~ గ్రంథము 128 >