< కీర్తనల~ గ్రంథము 124 >
1 ౧ దావీదు రాసిన యాత్రల కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
Ɔsoroforo dwom. Dawid de. Sɛ anka Awurade nni yɛn afa a, ma Israel nka,
2 ౨ మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
Sɛ anka Awurade nni yɛn afa bere a nnipa tow hyɛɛ yɛn so,
3 ౩ వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
bere a wɔn abufuw sɔre tiaa yɛn a anka wɔmemenee yɛn anikann;
4 ౪ నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
anka nsuyiri no bebu afa yɛn so, anka ɔhweam no bɛtwe yɛn akɔ,
5 ౫ జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
anka nsu a ano yɛ den no bɛpra yɛn kɔ.
6 ౬ వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
Ayeyi nka Awurade a wamma ho kwan amma wɔamfa wɔn se antetew yɛn mu.
7 ౭ వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
Yɛaguan sɛ anomaa afi ofirisumfo afiri mu; wɔabubu afiri no, ama yɛaguan.
8 ౮ భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.
Yɛn mmoa wɔ Awurade din mu, ɔsoro ne asase Yɛfo no.