< కీర్తనల~ గ్రంథము 124 >

1 దావీదు రాసిన యాత్రల కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
“Kama Yahwe asingekuwa upande wetu,” Israeli na aseme sasa,
2 మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
“Kama asingekuwa Yahwe ambaye alikuwa upande wetu wakati watu walipoinuka dhidi yetu,
3 వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
basi wangekuwa wametumeza tungali hai hasira yao lipozidi dhidi yetu.
4 నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
Maji yangetugharikisha; mto ungetuzidia.
5 జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
Kisha maji yafurikayo yangetuzamisha.”
6 వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
Atukuzwe Yahwe, ambaye hajaruhusu tuwe mawindo kwa meno yao.
7 వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
Tumetoroka kama ndege mtegoni mwa wawindaji; mtego umevunjika, nasi tumetoroka.
8 భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.
Msaada wetu uko katika Yahwe, aliyeziumba mbingu na nchi.

< కీర్తనల~ గ్రంథము 124 >