< కీర్తనల~ గ్రంథము 123 >
1 ౧ యాత్రల కీర్తన పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.
A song of ascents. I Lift up my eyes to you, who are throned in the heavens.
2 ౨ సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి.
As the eyes of a servant turn to the hand of his master, or the eyes of a maid to the hand of her mistress, so do our eyes turn to the Lord our God, until he is gracious to us.
3 ౩ యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము.
Be gracious, be gracious to us, Lord. Scorn enough, and more, have we borne
4 ౪ అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.
More than enough have we borne of derision from those at their ease, of scorn from those who are haughty.