< కీర్తనల~ గ్రంథము 122 >

1 దావీదు రాసిన యాత్రల కీర్తన పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.
다윗의 시 곧 성전에 올라가는 노래 사람이 내게 말하기를 여호와의 집에 올라가자 할 때에 내가 기뻐하였도다
2 యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.
예루살렘아 우리 발이 네 성문 안에 섰도다
3 యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.
예루살렘아 너는 조밀한 성읍과 같이 건설되었도다
4 యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.
지파들 곧 여호와의 이름에 감사하려고 이스라엘의 전례대로 그리로 올라가는도다
5 నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
거기 판단의 보좌를 두셨으니 곧 다윗 집의 보좌로다
6 యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.
예루살렘을 위하여 평안을 구하라 예루살렘을 사랑하는 자는 형통하리로다
7 నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి.
네 성 안에는 평강이 있고 네 궁중에는 형통이 있을지어다
8 మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.
내가 내 형제와 붕우를 위하여 이제 말하리니 네 가운데 평강이 있을지어다
9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను.
여호와 우리 하나님의 집을 위하여 내가 네 복을 구하리로다

< కీర్తనల~ గ్రంథము 122 >