< కీర్తనల~ గ్రంథము 122 >
1 ౧ దావీదు రాసిన యాత్రల కీర్తన పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.
Hodočasnička pjesma. Davidova. Obradovah se kad mi rekoše: “Hajdemo u Dom Jahvin!”
2 ౨ యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.
Eto, noge nam već stoje na vratima tvojim, Jeruzaleme.
3 ౩ యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.
Jeruzaleme, grade čvrsto sazdani i kao u jedno saliveni!
4 ౪ యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.
Onamo uzlaze plemena, plemena Jahvina, po Zakonu Izraelovu, da slave ime Jahvino.
5 ౫ నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
Ondje stoje sudačke stolice, stolice doma Davidova.
6 ౬ యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.
Molite za mir Jeruzalemov! Blago onima koji tebe ljube!
7 ౭ నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి.
Neka bude mir u zidinama tvojim i pokoj u tvojim palačama!
8 ౮ మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.
Radi braće i prijatelja svojih klicat ću: “Mir tebi!”
9 ౯ మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను.
Radi Doma Jahve, Boga našega, za sreću tvoju ja ću moliti.