< కీర్తనల~ గ్రంథము 121 >
1 ౧ యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
Hac ilahisi Gözlerimi dağlara kaldırıyorum, Nereden yardım gelecek?
2 ౨ యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
Yeri göğü yaratan RAB'den gelecek yardım.
3 ౩ ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
O ayaklarının kaymasına izin vermez, Seni koruyan uyuklamaz.
4 ౪ ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
İsrail'in koruyucusu ne uyur ne uyuklar.
5 ౫ నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.
Senin koruyucun RAB'dir, O sağ yanında sana gölgedir.
6 ౬ పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.
Gündüz güneş, Gece ay sana zarar vermez.
7 ౭ ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.
RAB her kötülükten seni korur, Esirger canını.
8 ౮ ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.
Şimdiden sonsuza dek RAB koruyacak gidişini, gelişini.