< కీర్తనల~ గ్రంథము 121 >

1 యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
上行之詩。 我要向山舉目; 我的幫助從何而來?
2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
我的幫助 從造天地的耶和華而來。
3 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
他必不叫你的腳搖動; 保護你的必不打盹!
4 ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
保護以色列的, 也不打盹也不睡覺。
5 నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.
保護你的是耶和華; 耶和華在你右邊蔭庇你。
6 పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.
白日,太陽必不傷你; 夜間,月亮必不害你。
7 ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.
耶和華要保護你,免受一切的災害; 他要保護你的性命。
8 ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.
你出你入,耶和華要保護你, 從今時直到永遠。

< కీర్తనల~ గ్రంథము 121 >