< కీర్తనల~ గ్రంథము 120 >
1 ౧ యాత్రల కీర్తన నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.
Hac ilahisi Sıkıntıya düşünce RAB'be seslendim; Yanıtladı beni.
2 ౨ యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.
Ya RAB, kurtar canımı yalancı dudaklardan, Aldatıcı dillerden!
3 ౩ మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?
Ey aldatıcı dil, RAB ne verecek sana, Daha ne verecek?
4 ౪ తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.
Yiğidin sivri oklarıyla Retem çalısından alevli korlar!
5 ౫ అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.
Vay bana, Meşek'te garip kaldım sanki, Kedar çadırları arasında oturdum.
6 ౬ విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను.
Fazla kaldım Barıştan nefret edenler arasında.
7 ౭ నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు.
Ben barış yanlısıyım, Ama söze başladığımda, Onlar savaşa kalkıyor!