< కీర్తనల~ గ్రంథము 120 >

1 యాత్రల కీర్తన నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.
Kanto de suprenirado. Al la Eternulo mi vokis en mia sufero, Kaj Li aŭskultis min.
2 యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.
Ho Eternulo, savu mian animon de mensoga parolo, De falsa lango.
3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?
Kion Li donos al vi, Kaj kion Li alportos al vi, ho falsa lango?
4 తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.
Akrajn sagojn de fortulo Kun karboj genistaj.
5 అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.
Ve al mi, ke mi gastas en Meŝeĥ, Ke mi loĝas inter la tendoj de Kedar!
6 విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను.
Tro longe loĝis mia animo Inter malamantoj de paco.
7 నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు.
Mi estas pacema; Sed kiam mi ekparolas, ili komencas militon.

< కీర్తనల~ గ్రంథము 120 >