< కీర్తనల~ గ్రంథము 12 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. షేమినిత్ రాగం. యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు.
【求免於是非】 達味詩歌,交與樂官,八度低音。 主,求你拯救,因為熱心者已缺少,忠誠的人在人間也已絕跡不見了。
2 అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.
人們彼此言談虛偽,嘴唇圓滑,口是心非,
3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.
願上主將一切欺詐的口唇除去。把大言不慚的舌頭剪除!
4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.
他們揚言說:「我們以口以舌取勝;有口有唇護衛我們,誰能作我們的主人?」
5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
「為了貧苦者的委屈,為了窮困者的歎息,我要立刻站起──上主說:將渴望救援的人救起。
6 యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.
上主的聖言是真誠的聖言,如同純銀經過七次的鍛鍊。
7 నువ్వు యెహోవావు! నువ్వు వాళ్ళను కాపాడతావు. భక్తిగల వాళ్ళను ఈ దుర్మార్గపు తరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు.
上主,懇求你護祐我們,由這一代常拯救我們。
8 మనుషుల్లో చెడుతనం ప్రబలినప్పుడు, దుర్మార్గులు అన్నివైపులా తిరుగుతారు.
惡人在四周往來追蹤,實如令人生厭的毒蟲。

< కీర్తనల~ గ్రంథము 12 >