< కీర్తనల~ గ్రంథము 119 >
1 ౧ ఆలెఫ్ ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.
品行完美遵行上主法律的,這樣的人才算是真有福的,
2 ౨ ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.
遵守上主誡命全心尋求祂的,這樣的人才算是真有福的。
3 ౩ వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.
他們總不為非作惡,只按祂的道路生活。
4 ౪ మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.
您頒發了您的命令,叫他們嚴格去遵行。
5 ౫ ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!
願我的行徑堅定,為遵守您的章程!
6 ౬ నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.
我若重視您的每條誡律,我就絕對不會蒙羞受辱。
7 ౭ నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
我一學習您正義的判詞,就以至誠的心靈頌謝您。
8 ౮ నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. బేత్
我要遵守您的規矩,不要將我完全棄去!
9 ౯ యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?
青年怎樣才能守身如玉?那就只有遵從您的言語。
10 ౧౦ నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.
我要用我整個心尋覓您,不要讓我錯行您的諭旨!
11 ౧౧ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
我將您的話藏在我心裏,免得我犯罪而獲罪於您。
12 ౧౨ యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.
上主,您理應受讚頌,教訓我遵守您的誡命。
13 ౧౩ నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.
您所傳授的一切法度,我要以我的脣舌敘述。
14 ౧౪ సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.
我喜愛您約法的道路,就如喜愛一切的財富。
15 ౧౫ నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.
我要默想上主的法度,要沉思您一切的道路。
16 ౧౬ నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. గీమెల్
我喜歡您一切的章程,我永遠不忘您的聖言。
17 ౧౭ నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.
請恩待您的僕人我得以生存,這樣使我能夠服從您的綸音。
18 ౧౮ నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.
求您開明我的眼睛,透視您法律的奇能。
19 ౧౯ నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.
我原是寄居塵世的旅客,不要向我隱瞞您的規則。
20 ౨౦ అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.
我因常常渴慕您的諭令,我的靈魂便為此而成病。
21 ౨౧ గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.
您已經怒責了驕矜橫蠻的人,背棄您誡命的,是可咒詛的人。
22 ౨౨ నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.
請除去我所受的淩辱與輕謾,因為我已經遵守了您的規範。
23 ౨౩ పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.
判官雖然反對我而開庭,您僕人仍然默思您的章程。
24 ౨౪ నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్
因為您的誡命是我的喜樂,您的典章是我的謀士。
25 ౨౫ నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.
我的靈魂雖已輾轉於灰塵,求你照你的諾言使我生存。
26 ౨౬ నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.
我陳明我的行徑,您便垂聽了我;
27 ౨౭ నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.
請指給我您約法的路徑,我要沉思您的奇妙工程。
28 ౨౮ విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
我的靈魂因憂傷而滴滴流淚,請照您的諾言使我奮昂興起。
29 ౨౯ మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.
求您不要使我走錯誤的道路,求您賜我常遵守您的法度。
30 ౩౦ విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.
我揀定真理的途徑,我矢志服從您的諭令。
31 ౩౧ యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.
我時常依戀著您的法度,上主不要叫我蒙受羞辱。
32 ౩౨ నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. హే
我必奔赴您誡命的路程,因為您舒展了我的心靈。
33 ౩౩ యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.
上主,給我指出您章程的道路,我要一直到死仔細遵守。
34 ౩౪ నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
求您教訓我遵守您的法律,我要以整個心靈持守不逾。
35 ౩౫ నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.
求您引導我走您誡命的捷徑,因為這捷徑使我非常高興。
36 ౩౬ నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.
使我的心傾慕您的律例,不要讓我的心貪財好利。
37 ౩౭ పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.
求您轉回我的眼目免看虛榮,求您按照您的道路賜我生命。
38 ౩౮ నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.
求您向您的僕人實踐您的許諾,即您向敬愛您的人所許的恩賜。
39 ౩౯ నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.
求您除去我所怕的羞恥,因為您的約法是我的甘飴。
40 ౪౦ నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. వావ్
我如何渴慕您的規約,按照您的正義賜我生活。
41 ౪౧ యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.
上主,願您的仁慈和救恩,照您的諾言臨於我身!
42 ౪౨ అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.
對凌辱我的人,我有所答辯,因為我全寄望於你的聖言。
43 ౪౩ నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.
不要由我口撤去真理的訓言,因我一心一意渴望你的判斷。
44 ౪౪ ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.
我要常常遵守你的法典,時時不斷,一直要到永遠。
45 ౪౫ నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.
我要行走平坦寬闊的途徑,因為我常常追求你的誡命。
46 ౪౬ సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.
我要傳述您的規律,在列王前也不畏懼。
47 ౪౭ నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.
我非常喜悅您的規誡,因為我對此有所鍾愛。
48 ౪౮ నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. జాయిన్.
我向您的誡命舉起我的手,對您的一切章程沉思不休。
49 ౪౯ నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.
求您莫把您給您的僕人的諾言遺忘,因為您在這諾言裏賜給我希望。
50 ౫౦ నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.
在我的憂苦中,這是我的安慰,因為您的聖言,賜給了我生氣。
51 ౫౧ గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.
驕傲人雖加給我極度的侮辱,但我卻沒有偏離過您的法律。
52 ౫౨ యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.
我一思到您永怚的斷定;上主,我是多麼安慰而高興。
53 ౫౩ నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.
為了背棄您法律的罪人,我不知不覺地恕火焚心。
54 ౫౪ యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.
在我這客居不定的寓所,您的法令成了我的詩歌。
55 ౫౫ యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.
上主,夜間我想起您的聖名,我就決意遵守您的法令。
56 ౫౬ నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. హేత్
我之所以如此這般,因我遵守您的規範。
57 ౫౭ యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.
上主,我說:我的福分,就是遵守您的教訓。
58 ౫౮ కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.
我全心仰膽著您的容貌,求您按您的諾言憐憫我。
59 ౫౯ నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.
我一默想到我所走的道路,就把我的腳轉您的法度。
60 ౬౦ నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.
爽爽快快,毫不躊躇,我常遵守您的法度。
61 ౬౧ భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.
惡人的繩索雖將我纏起,我郤未將您的法律忘記。
62 ౬౨ న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.
為了您正義的判語,我半夜起身讚美您。
63 ౬౩ నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. తేత్
我常向敬愛您的人為友,與遵守您誡命的人為侶。
64 ౬౪ యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
上主,您的慈愛充滿大地,求您教我遵守您的律例。
65 ౬౫ యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
上主,您依照您的言詞,善待了您的僕役。
66 ౬౬ నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
您以知識和聰慧教訓我,我要一心信賴您的誡條。
67 ౬౭ బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
我在受苦以前徘徊岐途,但我現今順從您的訓語。
68 ౬౮ నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.
您是慈善的,好施仁惠,求您給我教授您的規矩。
69 ౬౯ గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
驕傲人捏造謊言陷害我,我要全心遵守您的規約。
70 ౭౦ వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.
他們的心遲純如蒙脂肪,然而我卻喜歡您的典章。
71 ౭౧ బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
為叫我能學習您的法度,受若遭難於我確有好處。
72 ౭౨ వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. యోద్
您頒的法律對我的利益,連千萬的金銀也不能比。
73 ౭౩ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.
您的雙手創造了我,形成了我;求您賜我智力,為學您的誡條。
74 ౭౪ నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.
敬愛您的人,見我就喜歡;因為我常仰望您的聖言。
75 ౭౫ యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.
上主,我知道您的審判是公正無私的,您叫我遭受磨難是理所當然的。
76 ౭౬ నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.
照您給您僕人的許諾,按您的仁慈來安慰我。
77 ౭౭ నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.
願您的仁愛臨於我,使我生活,因為您的法律就是我的喜樂。
78 ౭౮ నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
願無端難為我的驕傲人蒙羞!但是我要默想沉思您的法律。
79 ౭౯ నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
願那些敬愛您的人歸向我,願關心您的人依附我!
80 ౮౦ నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. కఫ్
願我全心遵守您的法典,這樣我便不致自覺羞赧。
81 ౮౧ నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
我靈渴慕您的救援而衰弱,我熱切地盻望著您的許諾。
82 ౮౨ నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
我對您的諾言望眼欲穿,究竟您何時才賜我慰安?
83 ౮౩ నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
我雖然相似煙熏的皮囊,我仍然不忘卻您的典章。
84 ౮౪ నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
您僕人的歲月還能有多久?您何時處罰迫害我的惡徒?
85 ౮౫ నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
不按您法律生活的驕傲人,暗中給我挖掘了陷阱深坑。
86 ౮౬ నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.
您所有的一切誡命全是真道;他們無理迫害我,求您協助我。
87 ౮౭ భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.
我們幾乎將我由地上滅絕,但我卻沒有背棄您的規誡。
88 ౮౮ నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు. లామెద్.
您按照您的仁慈使我生活,這樣我必遵守您口中的條約。
89 ౮౯ యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
上主您的聖言,永遠存留,它堅固而不移,好似蒼天。
90 ౯౦ నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
您所有的忠誠,代代流傳,您所造的大地,屹立不變。
91 ౯౧ అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
天地時常遵守您的旨意,因為萬物都是您的僕役。
92 ౯౨ నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.
我如果不喜愛您的法令,我早已在我苦患中喪命。
93 ౯౩ నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.
我永遠不忘卻您的法令,因為您藉此賜給我生命。
94 ౯౪ నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.
我全屬於您,求您救拔我,因為我尋求了您的法約。
95 ౯౫ నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
惡人窺視我,忌把我殺害,然而我仍細想您的規誡。
96 ౯౬ సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. మేమ్
我看任何齊全的都有界限,唯您的誡命卻廣闊無邊。
97 ౯౭ నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
上主,我是多麼愛慕您的法律,它是我終日對默想的題目。
98 ౯౮ నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
您的誡命永遠存在於我心,它使我比我的仇敵聰明。
99 ౯౯ నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
我比我所有的教師更聰明,因為我常默想您的法令。
100 ౧౦౦ నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
我比老年的人更有智慧,因為我恪守您的律例。
101 ౧౦౧ నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
我使我的腳迴避一切惡路,為叫我能夠遵守您的言語。
102 ౧౦౨ నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
我不偏離您的約法,因為是您教訓了我。
103 ౧౦౩ నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
您的教言對我上顎多麼甘美!在我的口中比蜂蜜更要甘美!
104 ౧౦౪ నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి. నూన్
由您的誡命,我獲得了聰明,因我憎惡一切欺詐的途徑。
105 ౧౦౫ నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
上主,您的言語是我腳步的明燈,是我路途上的光明。
106 ౧౦౬ నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
我今起誓,我要定志,堅守您正義的諭令。
107 ౧౦౭ యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.
上主,我已經受苦很重,照您的諾言,保我生命。
108 ౧౦౮ యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు
上主,請悅納我口中的祭獻,請教訓我明白您的審斷。
109 ౧౦౯ నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.
我的生命常處於危險中,但我仍不忘記您的法典。
110 ౧౧౦ నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.
惡人雖然給我設下陷阱,我仍然不偏離您的章程。
111 ౧౧౧ నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.
您的誡命永做我的家產,因為這是我心中的喜歡。
112 ౧౧౨ నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం. సామెహ్
我要傾心遵守您的法典,千秋萬世,一直到永遠。
113 ౧౧౩ రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
我惱恨心懷二意的人,對您的法律,我喜愛萬分。
114 ౧౧౪ నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
您是我的庇護我的盾牌,因此我唯您的聖言是賴。
115 ౧౧౫ నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.
作惡的人,您們應離我遠去!因為我要遵守天主的法度。
116 ౧౧౬ నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.
照您的諾言,扶持我的生命,不要讓我的希望成成為泡影。
117 ౧౧౭ నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.
求您扶持我得蒙拯救,能時常留意您的制度。
118 ౧౧౮ నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.
凡背棄您法令的,您都鄙棄,因為他們的思念全是詐欺。
119 ౧౧౯ భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.
地上的惡人您都看作渣滓,因此我非常喜愛您的法制。
120 ౧౨౦ నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్
我的肉身因敬愛您而戢戰憟,對您的諭令失也知所敬愛。
121 ౧౨౧ నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.
我行正義及合法律的事情,別把我交於壓迫我的壞人。
122 ౧౨౨ మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.
求您保證您僕人的安全,沒有驕傲心將我磨難。
123 ౧౨౩ నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.
對您的救助和正義的諾言,我熱切渴盻已經望眼欲穿。
124 ౧౨౪ నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
求您照您的仁慈恩待您的僕人,也求您教訓我能明白您的章程。
125 ౧౨౫ నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి
我是您的僕人,求賜我明達,為使我能夠通曉您的約法。
126 ౧౨౬ ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.
現今是上主行動的時候,因他們違反了您的法度。
127 ౧౨౭ బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.
所以我愛慕您的誡律,遠勝各種黃金和寶玉。
128 ౧౨౮ నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం. పే
我尊重您的一切誡命,憎惡所有的欺詐途徑。
129 ౧౨౯ నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.
您的約法誠然是美妙神奇,因此我的靈魂要遵守不離。
130 ౧౩౦ నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.
您的言語經過解釋必會發亮光照,連知識淺薄的人也可以通達知曉。
131 ౧౩౧ నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.
我張開我的口嗟嘆唏嚧,因為我極渴慕您的誡律。
132 ౧౩౨ నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.
求您回身向我,垂憐我,如素常對待愛您名者然。
133 ౧౩౩ నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.
引導我的腳步履行您的訓誥,不要允許任何邪惡來主宰我。
134 ౧౩౪ నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.
求您救我擺挩人的欺壓,為使我能遵守您的律法。
135 ౧౩౫ నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
求您給您的僕人顯示您的慈顏,同時也您們給我教導您的規範。
136 ౧౩౬ ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. సాదె
我的眼淚滴滴下流有如溪水,因為他們全不遵守您的法規。
137 ౧౩౭ యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.
上主,您原是公義的,您的判決是正直的。
138 ౧౩౮ నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.
您以正義和至誠,立定了您的誡命。
139 ౧౩౯ నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.
我的熱火快要將我消耗殆盡,因為我的敵人忘了您的聖訓。
140 ౧౪౦ నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.
您的教言經過千捶百鍊,您的僕人對它愛不知倦。
141 ౧౪౧ నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.
我雖然年記幼小,被人輕看,可是我總不忘卻您的法範。
142 ౧౪౨ నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.
您的正義永遠公正,您的法律永遠堅定。
143 ౧౪౩ బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
困苦和壓迫雖然來臨我身,但您的誡命仍是我的歡欣。
144 ౧౪౪ నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. ఖొఫ్
您的約法永遠公允,賜我智慧,使我生存。
145 ౧౪౫ యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.
我全心呼號,並求您俯聽,上主,我要遵守您的法令。
146 ౧౪౬ నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.
我呼號您,求您救護,我必遵守您的法度。
147 ౧౪౭ తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను
天還未亮,我就起來求助,熱切期待您的訓語,
148 ౧౪౮ నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
夜裏每更,我都睜開眼睛,全是為了您的聖訓。
149 ౧౪౯ నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.
上主,請照您的仁慈俯聽我的呼聲,上主,請照您的正義使我得以重生。
150 ౧౫౦ దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.
非法迫害我的人已經臨近,他們都遠離了您的法令。
151 ౧౫౧ యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.
上主,願您時常與我親近,您一切的誡命全屬忠信。
152 ౧౫౨ నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. రేష్
我早就已由您的約法得知,那都是您從永遠所立定。
153 ౧౫౩ నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.
求您垂視我的苦難而救拔我、因為我媲沒有忘記您的約法。
154 ౧౫౪ నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.
求您辯護我的案件而拯救我,並請依照您的諾言,使我生活。
155 ౧౫౫ భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.
恨不得救恩達達離開惡徒,因為他們不理睬您的法度。
156 ౧౫౬ యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.
上主,您的仁愛何其廣闊,按照您的諭旨,賜我生命。
157 ౧౫౭ నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.
迫害與磨難我的人確實眾多,然而我卻不曾偏離您的法約。
158 ౧౫౮ ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
奸黨惡輩我一看見就會生厭,因為他們都不遵守您的規範。
159 ౧౫౯ యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.
上主,請您看我如何愛您的訓令,上主,照您的仁慈保全我的生命。
160 ౧౬౦ నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి. షీన్
您聖言的總綱確是真實無欺,您正義的一切判斷永遠不移。
161 ౧౬౧ అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.
王侯雖然無緣無故加我苦難,我的心靈仍舊敬愛您的教言。
162 ౧౬౨ పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.
我對您的諾言實在歡喜若狂,像得到許多勝利品的人一像。
163 ౧౬౩ అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
奸詐邪惡是我所恨所愛的,您的法令是我所喜所愛的。
164 ౧౬౪ నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
為了您那正義的判詞,我一要讚美您七次。
165 ౧౬౫ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు
愛慕您法律的必飽享平安,沒有一點失足跌倒的危險。
166 ౧౬౬ యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.
上主,我期待您的助佑,上主,我遵守您的法度。
167 ౧౬౭ నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.
我的靈魂恪守您的規誡,因為我對規誡十分喜愛。
168 ౧౬౮ నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. తౌ
我必要遵守您的規誡和勸言,因我的一切道路在您的面前。
169 ౧౬౯ యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.
上主,願我呼聲上達於您,求您照您的約言使我明理。
170 ౧౭౦ నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.
願我的祈求到達您的面前,求您照您的諾言救我脫險。
171 ౧౭౧ నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.
願我的雙脣湧溢讚美歌曲!因為您給我教授您的法律。
172 ౧౭౨ నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.
願我的舌頭歌詠您的訓令!因您的一切誡命盡屬公正。
173 ౧౭౩ నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.
願您伸出您的手救助我!因為我揀選您的法約。
174 ౧౭౪ యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.
上主,我渴望您的救援,您的法律是我的喜樂。
175 ౧౭౫ నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక
願我的靈魂活著讚美您,願您的斷語來支持我!
176 ౧౭౬ తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.
我像迷路的亡羊,請尋回您的僕人,因為我總沒有忘記您任何的誡命。