< కీర్తనల~ గ్రంథము 118 >

1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
Monna Awurade ase efisɛ oye, na nʼadɔe wɔ hɔ daa.
2 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.
Momma Israel nka se, “Nʼadɔe wɔ hɔ daa.”
3 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.
Momma Aaronfi nka se, “Nʼadɔe wɔ hɔ daa.”
4 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.
Momma wɔn a wosuro Awurade nka se, “Nʼadɔe wɔ hɔ daa.”
5 ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.
Mʼahohia mu, misu frɛɛ Awurade; ogyee me so, na ɔma me dee me ho.
6 యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?
Awurade ne me boafo; enti merensuro. Dɛn na onipa betumi ayɛ me?
7 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.
Awurade ne me wɔ hɔ; ɔyɛ me boafo. Mede nkonimdi bɛhwɛ mʼatamfo.
8 మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Eye sɛ yebehintaw wɔ Awurade mu, sen sɛ yɛde yɛn ho bɛto onipa so.
9 రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Eye sɛ yebehintaw Awurade mu, sen sɛ yɛde yɛn ho bɛto mmapɔmma so.
10 ౧౦ అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Amanaman no nyinaa twaa me ho hyiae, nanso Awurade din mu mitwitwaa wɔn gui.
11 ౧౧ నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Wotwaa me ho hyiaa wɔ baabiara, nanso Awurade din mu, mitwitwaa wɔn gui.
12 ౧౨ కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Wɔkyere guu me so sɛ nnowa, nanso wɔhyew ntɛm so sɛ nsɔe a ogya atɔ mu; Awurade din mu mitwitwaa wɔn gui.
13 ౧౩ వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు.
Wosum me kɔɔ mʼakyi a anka mereyɛ ahwe ase, nanso Awurade boaa me.
14 ౧౪ యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.
Awurade yɛ mʼahoɔden ne me bammɔ; wayɛ me nkwagye.
15 ౧౫ నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.
Osebɔ ne nkonimdi gyigye wɔ atreneefo ntamadan mu se, “Awurade nsa nifa ayɛ nneɛma akɛse!
16 ౧౬ యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది.
Wɔama Awurade nsa nifa so; Awurade nsa nifa ayɛ nneɛma akɛse!”
17 ౧౭ నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను.
Merenwu, mmom mɛtena ase na mapae mu aka nea Awurade ayɛ.
18 ౧౮ యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు.
Awurade atwe mʼaso dennen, nanso onyaa me mmaa owu ɛ.
19 ౧౯ నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.
Bue trenee apon ma me; na mɛhyɛn mu na mede aseda ama Awurade.
20 ౨౦ ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.
Awurade ponkɛse ni; ɛhɔ na atreneefo bɛfa ahyɛn mu.
21 ౨౧ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.
Mɛda wo ase, efisɛ wugyee me so; na woayɛ me nkwagye.
22 ౨౨ ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.
Ɔbo a adansifo no poe no, abɛyɛ tweatibo.
23 ౨౩ ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.
Awurade na wayɛ eyi, na ɛyɛ nwonwa wɔ yɛn ani so.
24 ౨౪ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.
Nnɛ yɛ da a Awurade ayɛ. Momma yɛn ani nnye na yenni ahurusi.
25 ౨౫ యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.
Awurade, gye yɛn nkwa; Awurade, ma yɛn nkonimdi.
26 ౨౬ యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.
Nhyira ne nea ɔnam Awurade din mu reba. Yehyira wo fi Awurade fi.
27 ౨౭ యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.
Awurade yɛ Onyankopɔn, na wama ne hann ahyerɛn yɛn so. Momfa nnua mman nkura na yɛnto afɔrebɔ santen nkɔ afɔremuka no mmɛn ho.
28 ౨౮ నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.
Woyɛ me Nyankopɔn na meyi wo ayɛ; wone me Nyankopɔn na mɛma wo so.
29 ౨౯ యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
Monna Awurade ase, efisɛ oye; na nʼadɔe wɔ hɔ daa.

< కీర్తనల~ గ్రంథము 118 >