< కీర్తనల~ గ్రంథము 118 >
1 ౧ యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
DANKE leowa, pwe i me man, pwe a kalanan pan potopot eta.
2 ౨ ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.
Ijrael en indinda: A kalanan pan potopot eta.
3 ౩ ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.
Kadaudok en Aron en indinda: A kalanan pan potopot eta.
4 ౪ ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.
Me majak Kot akan en inda: A kalanan pan potopot eta.
5 ౫ ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.
Ni ai apwal akan i likwir won leowa; leowa kotin mani ia er o kotin kajone ia dier waja jaledok.
6 ౬ యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?
leowa kin kotin ieian ia, i jota majak, da me aramaj akan kak wiai on ia?
7 ౭ యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.
Ieowa kin kotin ieian ia nan pun en me jauaja ia, o i pan peren kida, me kailon kin ia.
8 ౮ మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Me mau, en liki Ieowa, jan kaporoporeki aramaj akan.
9 ౯ రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Me mau en liki Ieowa, jan kaporoporeki jaupeidi kan.
10 ౧౦ అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Men liki kan karoj kapil ia penaer; a ni mar en Ieowa i kaloe ir edier.
11 ౧౧ నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Re kapil ia penaer waja karoj, a ni mar en Ieowa i pan kaloe irail edier.
12 ౧౨ కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
Re kapil ia penaer dueta lonlap akan, a re kunlar dueta kinjiniai nan tuka; ni mar en Ieowa i kaloe irail edier.
13 ౧౩ వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు.
Re woki ia, pwe i ne pupedi, a Ieowa kotin jauaja iaer.
14 ౧౪ యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.
Ieowa iei ai kel o ai kaul, o i me kotin wiala ai jaunkamaur.
15 ౧౫ నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.
Kaul en kaperen o kamaur kin wiaui nan im en me pun kan, lim en Ieowa pali maun kin kapwaiada dodok manaman.
16 ౧౬ యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది.
Pali maun en Ieowa me ileile, pali maun en Ieowa kin kapwaiada dodok manaman.
17 ౧౭ నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను.
I jota pan mela, pwe memaur eta o padaki duen wiawian Ieowa.
18 ౧౮ యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు.
Ieowa kotin kaloke ia laud, ap jota meuid on, i en mela.
19 ౧౯ నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.
Komail ritinadan ia wanim en pun, pwe i waja me i pan pedelon ia, pwen danke Ieowa.
20 ౨౦ ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.
Iet wanim en Ieowa, waja me pun kan pan pedelon ia.
21 ౨౧ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.
I danke komui, pwe kom kotin erekier ai kapakap o jauaja ia.
22 ౨౨ ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.
Takai o me pwin jauje kajelar, wialar takain pukakaim.
23 ౨౩ ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.
Mepukat wiauier ian ron Ieowa, meid kapuriamui ni maj at!
24 ౨౪ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.
let ran o, me Ieowa kotin wiadar, kitail en popol o peren kida i.
25 ౨౫ యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.
O Main Ieowa, kom kotin jauaja! O Main Ieowa, kom kotin kapwaiada!
26 ౨౬ యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.
Meid kapinan me kotido ni mar en Ieowa! Kit kapai komail da, me kijan toun tanpaj en Ieowa.
27 ౨౭ యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.
Ieowa iei Kot, o i me kotin kamarain kitail er; jaliedi men mairon ni oj en pei jaraui!
28 ౨౮ నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.
Komui ai Kot, o i pan danke komui; ai Kot, i pan kalinanada komui.
29 ౨౯ యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
Danke Ieowa, pwe i me mau, pwe a kalanan pan potopot eta.