< కీర్తనల~ గ్రంథము 116 >
1 ౧ యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.
Возлюбих, яко услышит Господь глас моления моего,
2 ౨ ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.
яко приклони ухо Свое мне: и во дни моя призову.
3 ౩ మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది. (Sheol )
Объяша мя болезни смертныя, беды адовы обретоша мя: скорбь и болезнь обретох и имя Господне призвах: (Sheol )
4 ౪ అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.
о, Господи, избави душу мою: милостив Господь и праведен и Бог наш милует.
5 ౫ యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.
Храняй младенцы Господь: смирихся, и спасе мя.
6 ౬ యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.
Обратися, душе моя, в покой твой, яко Господь благодействова тя:
7 ౭ నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.
яко изят душу мою от смерти, очи мои от слез и нозе мои от поползновения.
8 ౮ మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.
Благоугожду пред Господем во стране живых.
9 ౯ సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
10 ౧౦ నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.
Веровах, темже возглаголах: аз же смирихся зело.
11 ౧౧ నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.
Аз же рех во изступлении моем: всяк человек ложь.
12 ౧౨ యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?
Что воздам Господеви о всех, яже воздаде ми?
13 ౧౩ రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.
Чашу спасения прииму и имя Господне призову:
14 ౧౪ యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.
молитвы моя Господеви воздам пред всеми людьми Его.
15 ౧౫ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.
Честна пред Господем смерть преподобных Его.
16 ౧౬ యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.
О, Господи, аз раб Твой, аз раб Твой и сын рабыни Твоея: растерзал еси узы моя.
17 ౧౭ నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను
Тебе пожру жертву хвалы, и во имя Господне призову.
18 ౧౮ ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.
Молитвы моя Господеви воздам пред всеми людьми Его,
19 ౧౯ యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.
во дворех дому Господня, посреде тебе, Иерусалиме.