< కీర్తనల~ గ్రంథము 114 >
1 ౧ ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు,
Кад изађе Израиљ из Мисира, дом Јаковљев из народа туђег,
2 ౨ యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది.
Јудеја постаде светиња Божија, Израиљ област Његова.
3 ౩ సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.
Море виде и побеже; Јордан се обрати натраг.
4 ౪ పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.
Горе скакаше као овнови, брдашца као јагањци.
5 ౫ ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?
Шта ти би, море, те побеже и теби, Јордане, те се обрати натраг?
6 ౬ పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?
Горе, што скачете као овнови, и брдашца, као јагањци?
7 ౭ భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.
Пред лицем Господњим дрхћи, земљо, пред лицем Бога Јаковљевог.
8 ౮ ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.
Који претвара камен у језеро водено, гранит у извор водени.