< కీర్తనల~ గ్రంథము 113 >
1 ౧ యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
Хвалите, слуге Господње, хвалите име Господње,
2 ౨ ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
Да буде име Господње благословено одсад и довека.
3 ౩ సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
Од истока сунчаног до запада да се слави име Господње.
4 ౪ యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
Узвишен је над свима народима Господ; сврх небеса је слава Његова.
5 ౫ ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
Ко је као Господ, Бог наш, који седи на висини;
6 ౬ ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
Који се сагиба да види шта је на небесима и на земљи;
7 ౭ ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
Који из праха подиже убогога, и из кала узвишује ништега;
8 ౮ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
И посађује га с кнезовима, с кнезовима у народу његовом;
9 ౯ ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.
Од нероткиње насељава кућу, учинивши је радосном мајком синовима. Алилуја!