< కీర్తనల~ గ్రంథము 113 >

1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
הללו יה הללו עבדי יהוה הללו את שם יהוה׃
2 ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
יהי שם יהוה מברך מעתה ועד עולם׃
3 సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
ממזרח שמש עד מבואו מהלל שם יהוה׃
4 యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
רם על כל גוים יהוה על השמים כבודו׃
5 ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
מי כיהוה אלהינו המגביהי לשבת׃
6 ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
המשפילי לראות בשמים ובארץ׃
7 ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
מקימי מעפר דל מאשפת ירים אביון׃
8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
להושיבי עם נדיבים עם נדיבי עמו׃
9 ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.
מושיבי עקרת הבית אם הבנים שמחה הללו יה׃

< కీర్తనల~ గ్రంథము 113 >