< కీర్తనల~ గ్రంథము 112 >
1 ౧ యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.
Aleluja! Blagor mu, kdor, koli se boji Gospoda, v zapovedih njegovih raduje se močno.
2 ౨ అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.
Mogočno bode na zemlji seme njegovo; pravičnih rod se blagoslavlja.
3 ౩ కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
Moč in bogastvo v hiši njegovi in pravica njegova ostane vekomaj.
4 ౪ యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.
V temi blišči luč pravičnih; milosten je, usmiljen in pravičen.
5 ౫ జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.
Kdor je dober, darí deli milostno in posoja; svoje reči vlada po dolžnosti.
6 ౬ అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
Ker vekomaj ne omahne; v večnem spominu je pravični.
7 ౭ అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.
Hudega glasu se ne boji, z mirnim srcem svojim zaupajoč v Gospoda.
8 ౮ అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.
V srci svojem podprt se ne boji, dokler ne vidi hudega na sovražnikih svojih.
9 ౯ అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.
Razsiplje, daje potrebnim, pravica njegova ostane vekomaj; rog njegov se dviguje v časti.
10 ౧౦ భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.
Krivični pa vidi in se huduje, sè zobmí svojimi škripajoč koprní; krivičnih želja bode minila.