< కీర్తనల~ గ్రంథము 111 >

1 యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
הַלְלוּ ־ יָהּ ׀ אוֹדֶה יְהֹוָה בְּכׇל־לֵבָב בְּסוֹד יְשָׁרִים וְעֵדָֽה׃
2 యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.
גְּדֹלִים מַעֲשֵׂי יְהֹוָה דְּרוּשִׁים לְכׇל־חֶפְצֵיהֶֽם׃
3 ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
הוֹד־וְהָדָר פׇּעֳלוֹ וְצִדְקָתוֹ עֹמֶדֶת לָעַֽד׃
4 ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
זֵכֶר עָשָׂה לְנִפְלְאוֹתָיו חַנּוּן וְרַחוּם יְהֹוָֽה׃
5 తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.
טֶרֶף נָתַן לִירֵאָיו יִזְכֹּר לְעוֹלָם בְּרִיתֽוֹ׃
6 ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.
כֹּחַ מַעֲשָׂיו הִגִּיד לְעַמּוֹ לָתֵת לָהֶם נַחֲלַת גּוֹיִֽם׃
7 ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.
מַעֲשֵׂי יָדָיו אֱמֶת וּמִשְׁפָּט נֶאֱמָנִים כׇּל־פִּקּוּדָֽיו׃
8 అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.
סְמוּכִים לָעַד לְעוֹלָם עֲשׂוּיִם בֶּאֱמֶת וְיָשָֽׁר׃
9 ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.
פְּדוּת ׀ שָׁלַח לְעַמּוֹ צִוָּֽה־לְעוֹלָם בְּרִיתוֹ קָדוֹשׁ וְנוֹרָא שְׁמֽוֹ׃
10 ౧౦ యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.
רֵאשִׁית חׇכְמָה ׀ יִרְאַת יְהֹוָה שֵׂכֶל טוֹב לְכׇל־עֹֽשֵׂיהֶם תְּהִלָּתוֹ עֹמֶדֶת לָעַֽד׃

< కీర్తనల~ గ్రంథము 111 >