< కీర్తనల~ గ్రంథము 111 >
1 ౧ యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
你们要赞美耶和华! 我要在正直人的大会中,并公会中, 一心称谢耶和华。
2 ౨ యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.
耶和华的作为本为大; 凡喜爱的都必考察。
3 ౩ ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
他所行的是尊荣和威严; 他的公义存到永远。
4 ౪ ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
他行了奇事,使人记念; 耶和华有恩惠,有怜悯。
5 ౫ తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.
他赐粮食给敬畏他的人; 他必永远记念他的约。
6 ౬ ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.
他向百姓显出大能的作为, 把外邦的地赐给他们为业。
7 ౭ ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.
他手所行的是诚实公平; 他的训词都是确实的,
8 ౮ అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.
是永永远远坚定的, 是按诚实正直设立的。
9 ౯ ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.
他向百姓施行救赎, 命定他的约,直到永远; 他的名圣而可畏。
10 ౧౦ యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.
敬畏耶和华是智慧的开端; 凡遵行他命令的是聪明人。 耶和华是永远当赞美的!