< కీర్తనల~ గ్రంథము 110 >
1 ౧ దావీదు కీర్తన యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో.
【默西亞是君王也是司祭】 達味的聖詠。上主對我主起誓說:您坐在我右邊,等我使您的仇敵,變成您腳的踏板!
2 ౨ యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
上主由熙雍伸出您的權杖:我要在您仇敵中統治為王!
3 ౩ నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
神聖光輝的王位,您生之日,已偕同您,在曉明之前,好似甘露,我已生了您。
4 ౪ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
上主一發了誓,祂決不再反悔,您照默基瑟德品位,永做司祭!
5 ౫ ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు.
上主站在您右邊助戰,義怒的時日,把列王踏踐;
6 ౬ అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.
祂要懲罰萬民,堆壘他們的屍首,祂在大地各處擊碎他們的頭顱。
7 ౭ దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.
祂於道旁暢飲溪流,正為此而挺胸抬頭。