< కీర్తనల~ గ్రంథము 11 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
१मुख्य गायकासाठी; दाविदाचे स्तोत्र. परमेश्वरामध्ये मी आश्रय घेतो; पक्ष्यासारखे डोंगराकडे उडून जा, असे तुम्ही माझ्या जीवाला कसे म्हणता?
2 ౨ ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు.
२कारण पाहा! सरळ हृदयाच्यांना अंधारात मारावे म्हणून, दुष्ट आपला धनुष्य वाकवतात आणि आपला तीर दोरीला लावून तयार करतात.
3 ౩ పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?
३कारण जर पायेच नष्ट केले, तर न्यायी काय करणार?
4 ౪ యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
४परमेश्वर त्याच्या पवित्र स्वर्गात आहे; त्याचे डोळे पाहतात, त्याचे डोळे मनुष्याच्या संतानास पारखतात.
5 ౫ యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
५परमेश्वर नितीमानाची पारख करतो. परंतू जे दुष्ट व हिंसा करतात त्यांचा तो द्वेष करतो.
6 ౬ దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.
६तो दुष्टांवर जळते निखारे आणि गंधकाचा वर्षाव करील, दाहक वारा हाच त्यांचा वाटा असेल.
7 ౭ ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.
७कारण परमेश्वर नितीमान आहे आणि त्यास न्यायीपण प्रिय आहे. सरळ असलेले त्याचे मुख पाहतील.