< కీర్తనల~ గ్రంథము 109 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు.
Al Vencedor: de David: Salmo. Oh Dios de mi alabanza, no calles;
2 దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు.
porque boca de impío y boca de engañador se han abierto sobre mí; han hablado de mí con lengua mentirosa,
3 నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు
y con palabras de odio me rodearon; y pelearon contra mí sin causa.
4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను.
En pago de mi amor me han sido adversarios; mas yo oraba.
5 నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు.
Y pusieron contra mí mal por bien, y odio por mi amor.
6 ఇలాటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు. నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడు గాక.
Pon sobre él al impío; y Satanás esté a su diestra.
7 వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక
Cuando fuere juzgado, salga impío; y su oración sea para pecado.
8 వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక.
Sean sus días pocos; tome otro su oficio.
9 వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక
Sean sus hijos huérfanos, y su mujer viuda.
10 ౧౦ వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తు గాక. శిథిలమైపోయిన తమ ఇళ్ళకు దూరంగా సాయం కోసం అర్థిస్తారు గాక.
Y anden sus hijos vagabundos, y mendiguen; y procuren de sus desiertos.
11 ౧౧ వాడి ఆస్తి అంతా అప్పులవాళ్ళు ఆక్రమించుకుంటారు గాక. వాడు సంపాదించినది పరులు దోచుకుంటారు గాక.
Enrede el acreedor todo lo que tiene, y extraños saqueen su trabajo.
12 ౧౨ వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక. వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక.
No tenga quien le haga misericordia; ni haya quien tenga compasión de sus huérfanos.
13 ౧౩ వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక.
Su posteridad sea talada; en segunda generación sea raído su nombre.
14 ౧౪ వాడి పితరుల దోషం యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక. వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండు గాక.
Venga en memoria cerca del SEÑOR la maldad de sus padres, y el pecado de su madre no sea borrado.
15 ౧౫ యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక.
Estén siempre delante del SEÑOR, y él corte de la tierra su memoria.
16 ౧౬ ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు.
Por cuanto no se acordó de hacer misericordia, y persiguió al varón pobre en espíritu, y menesteroso, y quebrantado de corazón, para matarlo.
17 ౧౭ శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు.
Y amó la maldición, y ésta le sobrevino; y no quiso la bendición, y ella se alejó de él.
18 ౧౮ ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది.
Y se vistió de maldición como de su vestido, y entró como agua en sus entrañas, y como aceite en sus huesos.
19 ౧౯ కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక.
Séale como vestido con que se cubra, y en lugar del cinto con que se ciña siempre.
20 ౨౦ నాపై నేరం మోపేవారికి, నా గురించి చెడుగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుంది గాక.
Este sea el pago de parte del SEÑOR de los que me calumnian, y de los que hablan mal contra mi alma.
21 ౨౧ యెహోవా ప్రభూ, నీ నామాన్నిబట్టి నా పట్ల దయ చూపు. నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు.
Y tú, oh DIOS el Señor, haz conmigo por amor de tu Nombre: Líbrame, porque tu misericordia es buena.
22 ౨౨ నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది.
Porque yo soy pobre y necesitado; y mi corazón está herido dentro de mí.
23 ౨౩ సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు.
Como la sombra cuando declina me voy; soy arrebatado del viento como langosta.
24 ౨౪ ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది.
Mis rodillas están debilitadas a causa del ayuno, y mi carne desfallecida por falta de gordura.
25 ౨౫ నాపై నిందలు మోపే వారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు. వారు నన్ను చూసి తలాడిస్తున్నారు.
Yo he sido para ellos objeto de oprobio; me miraban, y meneaban su cabeza.
26 ౨౬ యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు.
Ayúdame, SEÑOR Dios mío; sálvame conforme a tu misericordia.
27 ౨౭ ఇది నీ వల్లనే జరిగిందనీ, యెహోవావైన నీవే దీన్ని చేశావనీ వారికి తెలియాలి.
Y entiendan que esta es tu mano; que tú, el SEÑOR, has hecho esto.
28 ౨౮ వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి.
Maldigan ellos, y bendice tú; levántense, mas sean avergonzados; y tu siervo sea alegrado.
29 ౨౯ నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక.
Sean vestidos de vergüenza los que me calumnian; y sean cubiertos de su confusión como con un manto.
30 ౩౦ సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను.
Yo alabaré al SEÑOR en gran manera con mi boca, y le loaré en medio de muchos.
31 ౩౧ ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.
Porque él se pondrá a la diestra del pobre en espíritu, para librar su alma de los que le juzgan.

< కీర్తనల~ గ్రంథము 109 >