< కీర్తనల~ గ్రంథము 109 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు.
Боже, славо моја, немој ћутати,
2 ౨ దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు.
Јер се уста безбожничка и уста лукава на ме отворише; говоре са мном језиком лажљивим.
3 ౩ నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు
Речима злобним са свих страна гоне ме, и оружају се на ме низашта.
4 ౪ నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను.
За љубав моју устају на мене, а ја се молим.
5 ౫ నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు.
Враћају ми зло за добро, и мржњу за љубав моју.
6 ౬ ఇలాటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు. నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడు గాక.
Постави над њим старешину безбожника, и противник нека му стане с десне стране.
7 ౭ వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక
Кад се стане судити, нека изађе крив, и молитва његова нека буде грех.
8 ౮ వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక.
Нека буду дани његови кратки, и власт његову нека добије други.
9 ౯ వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక
Деца његова нек буду сироте, и жена његова удовица.
10 ౧౦ వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తు గాక. శిథిలమైపోయిన తమ ఇళ్ళకు దూరంగా సాయం కోసం అర్థిస్తారు గాక.
Деца његова нек се потуцају и просе, и нека траже хлеба изван својих пустолина.
11 ౧౧ వాడి ఆస్తి అంతా అప్పులవాళ్ళు ఆక్రమించుకుంటారు గాక. వాడు సంపాదించినది పరులు దోచుకుంటారు గాక.
Нека му узме дужник све што има, и нека разграбе туђини муку његову.
12 ౧౨ వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక. వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక.
Нек се не нађе нико ко би га љубио, ни ко би се смиловао на сироте његове.
13 ౧౩ వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక.
Наслеђе његово нек се затре, у другом колену нека погине име њихово.
14 ౧౪ వాడి పితరుల దోషం యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక. వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండు గాక.
Безакоње старих његових нек се спомене у Господа, и грех матере његове нек се не избрише.
15 ౧౫ యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక.
Нека буду свагда пред Господом, и Он нека истреби спомен њихов на земљи;
16 ౧౬ ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు.
Зато што се није сећао чинити милост, него је гонио човека ништег и убогог, и тужном у срцу тражио смрт.
17 ౧౭ శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు.
Љубио је клетву, нека га и стигне; није марио за благослов, нека и отиде од њега.
18 ౧౮ ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది.
Нек се обуче у клетву као у хаљину, и она нек уђе у њега као вода, и као уље у кости његове.
19 ౧౯ కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక.
Нек му она буде као хаљина, у коју се облачи, и као појас, којим се свагда паше.
20 ౨౦ నాపై నేరం మోపేవారికి, నా గురించి చెడుగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుంది గాక.
Таква плата нек буде од Господа онима који ме ненавиде, и који говоре зло на душу моју.
21 ౨౧ యెహోవా ప్రభూ, నీ నామాన్నిబట్టి నా పట్ల దయ చూపు. నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు.
А мени, Господе, Господе, учини шта приличи имену Твом. Ти си добар, милошћу својом избави ме.
22 ౨౨ నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది.
Јер сам невољан и ништ, и срце је моје рањено у мени.
23 ౨౩ సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు.
Нестаје ме као сена, кад се одмиче; терају ме као скакавце.
24 ౨౪ ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది.
Колена моја изнемогоше од поста, и тело моје омрша.
25 ౨౫ నాపై నిందలు మోపే వారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు. వారు నన్ను చూసి తలాడిస్తున్నారు.
Постадох подсмех њима; видећи ме машу главом својом.
26 ౨౬ యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు.
Помози ми, Господе, Боже мој, спаси ме по милости својој.
27 ౨౭ ఇది నీ వల్లనే జరిగిందనీ, యెహోవావైన నీవే దీన్ని చేశావనీ వారికి తెలియాలి.
Нека познају да је ово Твоја рука, и Ти, Господе, да си ово учинио.
28 ౨౮ వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి.
Они куну, а Ти благослови; устају, али нек се постиде, и слуга се Твој обрадује.
29 ౨౯ నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక.
Нек се противници моји обуку у срамоту, и као хаљином нек се покрију стидом својим.
30 ౩౦ సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను.
Хвалићу Господа веома устима својим, и усред многих славићу Га,
31 ౩౧ ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.
Јер стоји с десне стране убогоме, да би га спасао од оних који осуђују душу његову.