< కీర్తనల~ గ్రంథము 108 >
1 ౧ లలిత గీతం. దావీదు కీర్తన దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను.
神よわが心はさだまれり われ謳ひまつらん 稱まつらん わが榮をもてたたへまつらん
2 ౨ స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను.
筝よ琴よさむべし われ黎明をよびさまさん
3 ౩ ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
ヱホバよ我もろもろの民のなかにてなんぢに感謝し もろもろの國のなかにてなんぢをほめうたはん
4 ౪ యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది.
そは汝のあはれみは大にして天のうへにあがり なんぢの眞實は雲にまでおよぶ
5 ౫ దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో.
神よねがはくはみづからを天よりもたかくし榮光を全地のうへに擧たまへ
6 ౬ నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి.
ねがはくは右の手をもて救をほどこし われらに答をなして愛しみたまふものに助をえしめたまへ
7 ౭ తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను.
神はその聖をもていひたまへり われ甚くよろこばん我シケムをわかちスコテの谷をはからん
8 ౮ గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం.
ギレアデはわがものマナセはわが有なりエフライムも亦わが首のまもりなりユダはわが杖
9 ౯ మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను.
モアブはわが足盥なりエドムにはわが履をなげんペリシテよわが故によりて聲をあげよと
10 ౧౦ కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు?
誰かわれを堅固なる邑にすすましめんや 誰かわれをみちびきてエドムにゆきしや
11 ౧౧ దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా?
神よなんぢはわれらを棄たまひしにあらずや 神よなんぢはわれらの軍とともに出ゆきたまはず
12 ౧౨ మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి.
ねがはくは助をわれにあたへて敵にむかはしめたまへ 人のたすけは空しければなり
13 ౧౩ దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.
われらは神によりて勇しくはたらかん われらの敵をふみたまふものは神なればなり