< కీర్తనల~ గ్రంథము 105 >
1 ౧ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.
Pris Herren, påkald hans navn, gør hans Gerninger kendte blandt Folkeslag!
2 ౨ ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
Syng og spil til hans Pris, tal om alle hans Undere;
3 ౩ ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.
ros jer af hans hellige Navn, eders Hjerte glæde sig, I, som søger HERREN;
4 ౪ యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.
spørg efter HERREN og hans magt, søg bestandig hans Åsyn;
5 ౫ ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
kom i Hu de Undere, han gjorde, hans Tegn og hans Munds Domme,
6 ౬ ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
I, hans Tjener Abrahams Sæd, hans udvalgte, Jakobs Sønner!
7 ౭ ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.
Han, HERREN, er vor Gud, hans Domme når ud over Jorden;
8 ౮ తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,
han ihukommer for evigt sin Pagt, i tusind Slægter sit Tilsagn,
9 ౯ ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
Pagten, han slutted med Abraham, Eden, han tilsvor Isak;
10 ౧౦ వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,
han holdt den i Hævd som Ret for Jakob, en evig Pagt for Israel,
11 ౧౧ కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.
idet han sagde: "Dig giver jeg Kana'ans Land som eders Arvelod."
12 ౧౨ ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.
Da de kun var en liden Hob, kun få og fremmede der,
13 ౧౩ వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా
og vandrede fra Folk til Folk, fra et Rige til et andet,
14 ౧౪ వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.
tillod han ingen at volde dem Men, men tugted for deres Skyld Konger
15 ౧౫ నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.
"Rør ikke mine Salvede, gør ikke mine Profeter ondt!"
16 ౧౬ దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు.
Hungersnød kaldte han frem over Landet, hver Brødets Støttestav brød han;
17 ౧౭ వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు.
han sendte forud for dem en Mand, Josef solgtes som Træl;
18 ౧౮ వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది.
de tvang hans Fødder med Lænker, han kom i Lænker af Jern,
19 ౧౯ అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.
indtil hans Ord blev opfyldt; ved HERRENs Ord stod han Prøven igennem.
20 ౨౦ రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.
På Kongens Bud blev han fri, Folkenes Hersker lod ham løs:
21 ౨౧ ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,
han tog ham til Herre for sit Hus, til Hersker over alt sit Gods;
22 ౨౨ తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు.
han styred hans Øverster efter sin Vilje og viste hans Ældste til Rette.
23 ౨౩ ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు.
Og Israel kom til Ægypten, Jakob boede som Gæst i Kamiternes Land.
24 ౨౪ ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు.
Han lod sit Folk blive såre frugtbart og stærkere end dets Fjender;
25 ౨౫ తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు.
han vendte deres Sind til Had mod sit Folk og til Træskhed imod sine Tjenere.
26 ౨౬ ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు.
Da sendte han Moses, sin Tjener, og Aron, sin udvalgte Mand;
27 ౨౭ వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు.
han gjorde sine Tegn i Ægypten og Undere i Kamiternes Land;
28 ౨౮ ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.
han sendte Mørke, så blev det mørkt, men de ænsede ikke hans Ord;
29 ౨౯ ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు.
han gjorde deres Vande til Blod og slog deres Fisk ihjel;
30 ౩౦ వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.
af Frøer vrimlede Landet, selv i Kongens Sale var de;
31 ౩౧ ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి.
han talede, så kom der Bremser og Myg i alt deres Land;
32 ౩౨ ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు.
han sendte dem Hagl for Regn og luende Ild i Landet;
33 ౩౩ వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు.
han slog både Vinstok og Figen og splintrede Træerne i deres Land;
34 ౩౪ ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,
han talede, så kom der Græshopper, Springere uden Tal,
35 ౩౫ అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి.
de åd alt Græs i Landet, de åd deres Jords Afgrøde;
36 ౩౬ వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు.
alt førstefødt i Landet slog han, Førstegrøden af al deres Kraft;
37 ౩౭ అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు.
han førte dem ud med Sølv og Guld, ikke een i hans Stammer snubled
38 ౩౮ వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు.
Ægypterne glæded sig, da de drog bort, thi de var grebet af Rædsel for dem.
39 ౩౯ వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.
Han bredte en Sky som Skjul og Ild til at lyse i Natten;
40 ౪౦ వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు.
de krævede, han bragte Vagtler, med Himmelbrød mættede han dem;
41 ౪౧ శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి.
han åbnede Klippen, og Vand strømmede ud, det løb som en Flod i Ørkenen.
42 ౪౨ ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,
Thi han kom sit hellige Ord i Hu til Abraham, sin Tjener;
43 ౪౩ తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.
han lod sit Folk drage ud med Fryd, sine udvalgte under Jubel;
44 ౪౪ అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.
han gav dem Folkenes Lande, de fik Folkeslags Gods i Eje.
45 ౪౫ వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.
Derfor skulde de holde hans Bud og efterkomme hans Love. Halleluja!