< కీర్తనల~ గ్రంథము 104 >
1 ౧ నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.
Me kra, kamfo Awurade! Awurade me Nyankopɔn, woyɛ ɔkɛse! Wɔafura wo tumi ne anuonyam.
2 ౨ ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.
Ɔde hann akata ne ho sɛ atade; ɔtrɛw ɔsoro mu te sɛ ntamadan,
3 ౩ జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.
na ɔde ne mpia mu mpuran sisi nsu so. Ɔde omununkum yɛ ne teaseɛnam na ɔde nantew mframa ntaban so.
4 ౪ వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.
Ɔsoma nʼabɔfo sɛ mframa, na ɔsoma nʼasomfo sɛ ogyaframa.
5 ౫ భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.
Ɔde asase asi ne fapem so na ɛrenhinhim da.
6 ౬ దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.
Wode bun kataa so sɛ atade na nsu gyinaa mmepɔw no so.
7 ౭ నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.
Nanso wʼanimka maa nsu no guanee, wʼaprannaa nnyigyei maa woguanee;
8 ౮ నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.
Wɔsen faa mmepɔw so, kɔɔ aku mu tɔnn, koguu faako a wode ama wɔn no.
9 ౯ అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.
Wotoo ɔhye a wɔrentumi ntra; na wɔammɛkata asase so bio.
10 ౧౦ ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.
Ɔma nsuwa sen fa abon mu, ɛsen fa mmepɔw ntam.
11 ౧౧ అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.
Wɔma wuram mmoa nyinaa nsu nom; atorɔm de kum wɔn sukɔm.
12 ౧౨ వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.
Wim nnomaa nwen wɔn berebuw wɔ nsu no ho; na wɔto nnwom wɔ nnua no mman so.
13 ౧౩ తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.
Ofi ne soro mpia mu tɔ nsu gugu mmepɔw so; ne nnwuma so aba mee asase.
14 ౧౪ పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు
Ɔma sare fifi ma anantwi, na ɔbɔɔ nnua maa onipa sɛ onnua na ɛmma aduan mfi asase mu:
15 ౧౫ అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.
nsa a ɛma onipa koma tɔ ne yam, ngo a ɛma onipa anim tɔ so, ne aduan a ekura onipa koma.
16 ౧౬ యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.
Wogugu Awurade nnua no so yiye, Lebanon sida a oduae no.
17 ౧౭ అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.
Ɛsow na nnomaa yɛ wɔn mmerebuw, na asukɔnkɔn nso yɛ nʼatenae wɔ ɔpepaw nnua no mu.
18 ౧౮ ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.
Mmepɔw atenten no yɛ wuram mmirekyi de; na abotan yɛ guankɔbea ma ewi.
19 ౧౯ ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.
Ɔsram kyerɛ bere nkyekyɛmu, na owia nim bere a ɔkɔtɔ.
20 ౨౦ నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.
Wode sum ba ma ɛyɛ adesae na kwae mu mmoa nyinaa kɔ ahayɛ.
21 ౨౧ సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.
Gyata bobɔ mu pɛ wɔn hanam, wɔhwehwɛ wɔn aduan fi Onyankopɔn hɔ.
22 ౨౨ సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.
Owia pue ma wɔsan wɔn akyi; wɔsan kɔdeda wɔn atu mu.
23 ౨౩ సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.
Afei, onipa kɔ nʼadwuma so kɔyɛ adwuma ara kosi anwummere.
24 ౨౪ యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.
Awurade, wo nnwuma dɔɔso! Nyansa mu na woyɛɛ ne nyinaa; wʼabɔde ahyɛ asase so ma.
25 ౨౫ అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.
Po na ɛda hɔ tɛtrɛɛ tamaa yi, a abɔde bebree a enni ano; akɛse ne nketewa ahyɛ no ma.
26 ౨౬ అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.
So na ahyɛn di akɔneaba, na ɔdɛnkyɛmmirampɔn a woyɛɛ no di agoru.
27 ౨౭ తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.
Wɔn nyinaa hwɛ wo kwan sɛ wobɛma wɔn wɔn aduan wɔ bere a ɛsɛ mu.
28 ౨౮ నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.
Wode ma wɔn a, wɔtase; wubue wo nsam a nnepa mee wɔn.
29 ౨౯ నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.
Wode wʼanim hintaw wɔn a, wɔbɔ hu; sɛ wugye wɔn home a, wowuwu na wɔsan kɔ mfutuma mu.
30 ౩౦ నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.
Sɛ wode wo Honhom no ma wɔn a na wɔabɔ wɔn, na woyɛ asase ani foforo.
31 ౩౧ యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.
Ma Awurade anuonyam ntena hɔ daa; ma Awurade ani nnye ne nnwuma ho,
32 ౩౨ ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.
nea ɔhwɛ asase na ɛwosow, na ɔde ne nsa ka mmepɔw a wusiw fi mu ba.
33 ౩౩ నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.
Mɛto dwom ama Awurade me nkwa nna nyinaa; sɛ mete ase yi, mɛto ayeyi dwom ama me Nyankopɔn.
34 ౩౪ ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.
Ɔmma me mpaebɔ nsɔ nʼani bere a meregye mʼani wɔ Awurade mu yi.
35 ౩౫ పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.
Ma nnebɔneyɛfo nyera wɔ asase so; na amumɔyɛfo ase nhyew. Me kra, kamfo Awurade. Kamfo Awurade.